వాట్సాప్ కొత్తగా `అప్‌డేట్` చేసుకున్నారా..?
వాట్సాప్ కొత్తగా `అప్‌డేట్` చేసుకున్నారా..?
ప్రముఖ మొబైల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ గురించి తెలియని వారు ఉండరు. ప్రతి ఒక్కరూ ఈ వాట్సాప్²ని ఉపయోగిస్తున్నారు. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతూ యూజర్లను ఆకట్టుకొంటోంది వాట్సాప్. ఇటీవలే ‘డిలీట్ ఫర్ ఎవ్రీవన్’ అనే ఫీచర్‌ని కూడా తీసుకువచ్చింది. అంతకముందు ఒక్కసారి వాట్సాప్²లో మెసేజ్ పంపిస్తే.. దానిని తిరిగి వెనక్కి తీసుకునే అవకాశం ఉండేది కాదు.
డిలీట్ ఫర్ ఎవ్రీవన్ ఆప్షన్ వచ్చాక పంపినవాళ్లకి.. మెసేజ్ రిసీవ్ చేసుకున్న వాళ్లకి ఎవ్వరికీ కనపడదు. ఆ మెసేజ్ పూర్తిగా డిలీట్ అయిపోతుంది.
వాట్సాప్ ప్రవేశపెట్టిన "డిలీట్ ఫర్ ఎవ్రీవన్" అనే ఫీచర్‌లో తాజాగా మార్పులు చేసింది. యూజర్లకు మరో వెసులుబాటును కల్పించింది. తాజా మార్పులో మెసేజ్‌లను డిలీట్ చేసే గడువును భారీగా పొడిగించింది.
వాట్సాప్ గతేడాది "డిలీట్ ఫర్ ఎవ్రీవన్"అనే ఫీచర్‌ను ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. ఈ ఫీచర్ ద్వారా ఒక వేళ ఏదైనా మెసేజ్ పంపించాల్సిన గ్రూప్ లేదా కాంటాక్ట్‌కు కాకుండా మరో గ్రూపు లేదా కాంటాక్ట్‌కు పంపించినట్లయితే వెంటనే దాన్ని డిలీట్ చేసుకోవచ్చు. ఇలా పొరపాటున మెసేజ్ పంపితే.. మెసేజ్ పంపిన 7 నిమిషాల లోపు దానిని డిలీట్ చేసుకొనే అవకాశం ఇచ్చారు కొత్తలో. తర్వాత 1 గంట, 8 నిమిషాలు 16 సెకన్లకు పెంచారు.
కానీ తాజా అప్‌డేట్ చేసిన ఫీచర్ ప్రకారం..ఆ సమయం పెరిగింది. ఒక వేళ మనం పొరపాటున పంపిన మెసేజ్‌ను అవతల వ్యక్తి చూసుకోనంత వరకు అంటే 13 గంటల 8 నిమిషాల 16 సెకన్ల వరకు ఎప్పుడైనా డిలీట్ చేయవచ్చని వాట్సాప్‌ను మానిటర్ చేస్తున్న వాబిటెయిన్ ఇన్ఫో వెబ్‌సైట్ తెలిపింది. అయితే సాధారణంగా ఇది అవతల వ్యక్తి ఫోన్ స్విఛ్చాఫ్ చేసి పెట్టుకున్న సందర్భాల్లో జరుగుతుందని వెల్లడించింది.