త్వరలోనే వాట్సాప్ పనిచేయని స్మార్ట్ ఫోన్ల జాబితా ఇది
కొన్ని ఫోన్లలో త్వరలోనే వాట్సాప్ పనిచేయదని స్పష్టంచేసిన సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్
ఎప్పటికప్పుడు తనని తాను అప్ డేట్ చేసుకుంటూ సరికొత్త ఫీచర్లతో యూజర్ల ముందుకొస్తున్న తాజాగా ఓ షాకింగ్ న్యూస్ ని వెల్లడించింది. త్వరలోనే కొన్ని ఫోన్లపై వాట్సాప్ పనిచేయడం మానేస్తుందని ఆ సంస్థ ప్రకటించింది. ఇకపై తమ యూజర్లకు మరింత ఆహ్లాదకరమైన సేవలను అందించేందుకు తీసుకున్న నిర్ణయాల పర్యావసనమే ఈ మార్పు అని వాట్సాప్ ని సొంతం చేసుకున్న ఫేస్ బుక్ స్పష్టంచేసింది.
ఈ కిందునున్న జాబితాలోని ఆపరేటింగ్ సిస్టమ్స్ సహాయంతో పనిచేసే స్మార్ట్ ఫోన్లపై వాట్సాప్ త్వరలోనే మూగబోనుంది:
2.3.3 కన్నా పూర్వపు ఆండ్రాయిడ్ వెర్షన్స్
విండోస్ ఫోన్ 8.0 తోపాటు అంతకన్నా పాత ఫోన్లు
ఐఫోన్ 3జీఎస్/ఐఓఎస్ 6
నోకియ సింబియన్ ఎస్60
బ్లాక్ బెర్రీ ఓఎస్, బ్లాక్‌బెర్రీ 10
ఇదిలావుంటే, ఇంకొన్ని ఫోన్లపై పరిమితమైన కాలపరిమితి వరకే వాట్సాప్ పనిచేయనుంది. ఈ తరహా ఫోన్లపై ఇకపై కొత్తగా వాట్సాప్ ఎకౌంట్ క్రియేట్ చేయలేరు కానీ సదరు కాలపరిమితి ముగిసే వరకు వాట్సాప్ ని వినియోగించుకోవచ్చు. అలాంటి ఫోన్లు, ఓఎస్ వెర్షన్స్ వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి.
డిసెంబర్ 3, 2018 - నోకియా ఎస్40
ఫిబ్రవరి 1, 2020 - ఆండ్రాయిడ్ వెర్షన్స్
ఫిబ్రవరి 1, 2020 - ఐఓఎస్ 7 తోపాటు అంతకన్నా పూర్వ వెర్షన్ కలిగిన ఫోన్లు
అంతేకాకుండా ఒక ఫోన్ పై ఒక వాట్సాప్ నెంబర్ మాత్రమే యాక్టివేట్ చేయడం జరుగుతుందని వాట్సాప్ యూజర్లు తెలుసుకోవాల్సిందిగా సంస్థ సూచించింది. అన్నట్టు గతంలోనూ ఓసారి ఇలాగే వాట్సాప్ పనిచేయని ఫోన్ల జాబితా అంటూ పలు స్మార్ట్ ఫోన్ల పేరు వెల్లడించినందుకు వాట్సాప్ సంస్థ సదరు ఫోన్ల ఆగ్రహానికి గురైన సంగతి తెలిసిందే.