నటీనటులు: రాయ్ లక్ష్మీ, ప్రవీణ్, మధు నందన్, రామ్ కార్తిక్, పూజిత పొన్నాడ, బ్రహ్మాజీ, పంకజ్ కేసరి, అన్నపూర్ణమ్మ, జబర్దస్త్ మహేష్, జెమినీ సురేష్ తదితరులు..
దర్శకత్వం : కిషోర్ కుమార్
నిర్మాతలు: ఎం.శ్రీధర్ రెడ్డి , హెచ్.ఆనంద్ రెడ్డి, ఆర్కే రెడ్డి
బ్యానర్ : ఏబీటి క్రియేషన్స్
సినిమాటోగ్రఫీ : వెంకట్ ఆర్.శాఖమూరి
మ్యూజిక్ : హరి గౌర
కథ, కథనం, మాటలు : తాటవర్తి కిరణ్
ఎడిటర్ : ఎస్.ఆర్. శేఖర్
ఆర్ట్ : బ్రహ్మ కడలి
నిడివి : 2 గంటల 25 నిమిషాలు
సెన్సార్ : U/A
రిలీజ్ డేట్ : మార్చి 15, 2019


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

లక్ష్మీరాయ్ కు తెలుగులో కూడా ఫ్యాన్స్ ఉన్నారు. అలా పూర్తిగా ఆమె క్రేజ్ పై డిపెండ్ అయి తీసిన సినిమా వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మీ. మరి ఆమె నుంచి ఆశించే ఎలిమెంట్స్ అన్నీ ‘వెంకటలక్ష్మీ’లో ఉన్నాయా? సినిమా రిజల్ట్ ఏంటి? జీ సినిమాలు ఎక్స్ క్లూజివ్ రివ్యూ..
కథ
బెల్లంపల్లి అనే ఊరిలో పండుగాడు(మధు నందన్), చంటిగాడు(ప్రవీణ్) ఉంటారు. ఊళ్లో అందరికీ చిరాకు తెప్పిస్తుంటారు. వీళ్లు గొడవ పెట్టుకున్న ప్రతిసారి కామన్ ఫ్రెండ్ శేఖర్ (రామ్ కార్తీక్) వచ్చి కాపాడుతుంటాడు. ఆ ఊరికి టీచర్ గా వస్తుంది వెంకటలక్ష్మీ (లక్ష్మీరాయ్). పండు, చంటి ఇద్దరూ వెంకటలక్ష్మీని ఇష్టపడతారు. కానీ ఆ తర్వాత ఆమె దెయ్యం అనే విషయం తెలుసుకుంటారు.
నాగంపేటలో ఉన్న వీరారెడ్డి (పంకజ్ కేసరి) అనే వ్యక్తి ఇంట్లో దాచిన ఓ పెట్టెను తెచ్చి ఇస్తే ఇద్దర్నీ వదిలేస్తానని చెబుతుంది వెంకటలక్ష్మీ. అదే వీరారెడ్డి చెల్లెలు గౌరిని (పూజిత పొన్నాడ) శేఖర్ ప్రేమిస్తాడు. కానీ పండు, చంటి వల్ల వాళ్లు విడిపోతారు. ఎలాగోలా వీరారెడ్డి ఇంట్లోకి ప్రవేశించిన పండు, చంటి ఆ చిన్న పెట్టెను సాధించారా లేదా? ఇంతకీ ఆ పెట్టెలో ఏముంది? వెంకటలక్ష్మీ ఎవరు? శేఖర్-గౌరి ఒకటయ్యారా లేదా అనేది బ్యాలెన్స్ కథ.


నటీనటుల పనితీరు
సినిమా ప్రచారం మొత్తం లక్ష్మీరాయ్ చుట్టూ తిరిగింది. కానీ సినిమా మాత్రం ప్రవీణ్-మధు నందన్ చుట్టూ తిరుగుతుంది. ఇప్పటికే కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్న వీళ్లిద్దరూ సినిమాలో ఆల్ మోస్ట్ హీరోల కింద లెక్క. యాక్టింగ్ పరంగా ఇద్దరూ బెస్ట్ ఔట్ పుట్ ఇచ్చారు. కానీ ఇలాంటి ఇద్దరు హాస్యనటుల్ని పెట్టుకొని కామెడీ పండించలేకపోవడం కచ్చితంగా మేకర్స్ తప్పు.
ఇక వెంకటలక్ష్మీ పాత్ర పోషించిన లక్ష్మీరాయ్ చూడ్డానికి గ్లామరస్ గా ఉంది. ఇలాంటి క్యారెక్టర్స్ చేయడంలో ఆల్రెడీ అనుభవం ఉంది కాబట్టి అవలీలగా చేసేసింది. మరో హీరోయిన్ పూజిత పొన్నాడ ఈసారి గ్లామరస్ గా కనిపించి మెప్పించింది. యాక్టింగ్ మాత్రం వీక్. అన్నపూర్ణమ్మ, జబర్దస్త్ మహేష్, పంకజ్ కేసరి తమ పాత్రల మేరకు నటించారు.
టెక్నీషియన్స్ పనితీరు
కిరణ్ ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించాడు. అతడు రాసుకున్న లైన్ బాగుంది. దాన్ని ట్విస్టులతో చెబుతూ, క్లైయిమాక్స్ లో మేటర్ రివీల్ చేయాలన్న ఆలోచన కూడా బాగుంది. కానీ ఆ ప్రాసెస్ మాత్రం ప్రాపర్ గా తెరపైకి రాలేదు. చాలా చోట్ల తనకుతానే లాక్స్ పెట్టుకోవడంతో ఒక దశలో స్క్రీన్ ప్లే కూడా అతడి చేయి దాటిపోయింది. దీనికి తోడు దర్శకత్వం పరంగా కిషోర్ కుమార్ చేసిన తప్పులు కూడా సినిమాకు మైనస్ గా మారాయి.

 


ఉన్నతంలో వెంకట్ కెమెరా వర్క్, బ్రహ్మకడలి ఆర్ట్ వర్క్ మెప్పిస్తుంది. హరి గౌర అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగాలేదు. పాటలు కూడా రొటీన్ అనిపించినా, విజువల్స్ వద్ద 2 పాటలు మెప్పిస్తాయి. శేఖర్ ఎడిటింగ్ అక్కడక్కడ మాత్రమే మెరుస్తుంది. ఇంతకుముందే చెప్పుకున్నట్టు కథలో లాక్స్ వల్ల, ఎడిటర్ కూడా చేతులెత్తేసిన పరిస్థితి. విలేజ్ బ్యాక్ డ్రాప్ మూవీ కాబట్టి, ఉన్నంతలో ప్రొడక్షన్ వాల్యూస్ ఓకే అనిపిస్తాయి.


జీ సినిమాలు రివ్యూ
వేర్ ఈజ్ వెంకటలక్ష్మీ.. ఈ టైటిల్ చూసిన తర్వాత ఇదొక సస్పెన్స్ డ్రామా అనుకున్నారు. వెంకటలక్ష్మీ ఎవరనే సస్పెన్స్ ను రివీల్ చేసే ప్రాసెస్ లో సినిమా ఉంటుందని ఎక్స్ పెక్ట్ చేశారు. ట్రయిలర్ చూసిన తర్వాత దీనికి దెయ్యం యాంగిల్ కూడా జోడించారని అర్థమైంది. కానీ సినిమా చూసిన తర్వాత ఇది ఏ జానర్ మూవీ అనేది కూడా చెప్పడం కష్టం. అలా అని ఇదేదో ఇప్పటివరకు చూడని కథ, ఎక్స్ పీరియన్స్ చేయని స్క్రీన్ ప్లే అని కూడా అనుకోవద్దు. వెంకటలక్ష్మీ అనేది ఓ ఫక్తు రొటీన్ మాస్ మాసాల కిచిడీ కథ.


ఊరికి జరిగిన అన్యాయాన్ని డిఫరెంట్ గా చూపించాలనే ప్రయత్నంలో అటు లాజిక్కులు మిస్ అవ్వడంతో పాటు ఇటు కామెడీ కూడా లేకపోవడంతో వెంకటలక్ష్మీ కళ తప్పింది. లక్ష్మీరాయ్ ఎంటర్ అయినప్పుడే ప్రేక్షకులకు అనుమానం కలుగుతుంది. సీన్ బై సీన్ నడిచేకొద్దీ మన అనుమానాలు నిజం అవుతూ ఉంటాయి. ఇక క్లైమాక్స్ అయితే మరీ దారుణం. అది ఏ టర్న్ తీసుకుంటుంది, ఎలా ముగుస్తుందనే విషయాన్ని శుభం కార్డుకు అర్థగంట ముందే పసిగట్టేయొచ్చు.


అలా వెంకటలక్ష్మీ మన కనుసన్నల్లో అలా అలా సాగిపోతుంది. మన మనసులో ఉన్నట్టే అన్నీ చేస్తుంది. ఇక మనకు థ్రిల్ ఏముంటుంది. ఉన్నంతలో లక్ష్మీరాయ్ గ్లామర్ ఒకింత మెప్పిస్తుంది. లక్ష్మీరాయ్ కు ఏమాత్రం తీసిపోని విధంగా పూజిత పొన్నాడ కూడా అందాలతో అదరగొట్టింది. ఈ సినిమాలో ఏమైనా సర్ ప్రైజింగ్ ఎలిమెంట్ ఉందంటే, అది పూజిత పొన్నాడ గ్లామరస్ గా కూడా కనిపిస్తుందనే యాంగిల్ మాత్రమే.


టైటిల్ రోల్ పోషించిన వెంకటలక్ష్మీని సినిమా స్టార్ట్ అయిన అర్థగంట వరకు ప్రవేశపెట్టరు. ఆ తర్వాత కూడా సదరు వెంకటలక్ష్మీకి స్కోప్ ఇవ్వరు. తప్పదన్నట్టు క్లైమాక్స్ ముందు ఐటెంసాంగ్ టైపులో ఓ పాట మాత్రం పెట్టారు. లక్ష్మీరాయ్ అభిమానులు కూడా పూర్తిస్థాయిలో సంతృప్తి చెందని విధంగా వెంకటలక్ష్మీ రూపుదిద్దుకుంది. బలహీనమైన సన్నివేశాలు, లాజిక్కులు మిస్ అవ్వడం, లో-ప్రొడక్షన్ వాల్యూస్, డైరక్షన్ ఫెయిల్యూర్స్.. వెంకటలక్ష్మీని డీ-గ్లామరైజ్ చేశాయి.


బాటమ్ లైన్ – దేర్ ఈజ్ నో వెంకటలక్ష్మీ
రేటింగ్ – 2/5


 


@ జీ సినిమాలు