హైదరాబాద్: త్వరలో నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించబోయే చిత్రానికి హీరో గా  ప్రభాస్ ఇప్పటికే ఖరారైనప్పటికీ  ప్రతినాయికను నిర్ణయించలేదు. అయితే, బాలీవుడ్ సొగసరి కత్రినాకైఫ్ ప్రభాస్ సరసన నటించనున్నట్లు ఊహాగానాలు ఊపందుకున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: కరోనా ఎఫెక్ట్: 'బొమ్మ' బంద్


రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలి చిత్రం ద్వారా ఒక్కసారిగా ఆల్ టైం స్టార్ డామ్ సంపాదించిన ప్రభాస్ తన అంచనాలను ఒక్కసారిగా పెంచేశాడు. బాహుబలి-2 తర్వాత అంచానాలు తగ్గట్టుగానే భారీ బడ్జెట్ తో నిర్మించిన సాహో చిత్రంలో ప్రభాస్ సరసన బాలీవుడ్ అందాల భామ శ్రద్దా కపూర్ ను ఎంపిక చేశారు. దీంతో మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ కూడా తన తదుపరి చిత్ర ప్రతినాయిక కోసం బాలీవుడ్ లో వెదుకులాట మొదలెట్టాడా అనే సందేహాలు మొదలయ్యాయి. కాగా ప్రస్తుత టాలీవుడ్ దర్శకుల చూపు బాలీవుడ్ వైపు మళ్లింది. 


Also Read: 'హోలీ హోలీల రంగ హోలీ' అంటున్న హార్ధిక్


మరోవైపు పూరీజగన్నాధ్ దర్శకత్వం వహిస్తున్న ఫైటర్ చిత్రంలో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రంలో బాలీవుడ్ నటిమణి అనన్య పాండేను ఎంపిక చేశారు. అంతేకాకుండా క్రిష్ జగర్లముడి దర్శకత్వం వహించబోతోన్న తదుపరి చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన జాక్వెలిన్ ఫెర్నాండెజ్ రొమాన్స్ చేయనున్నట్లు తెలిపారు.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 


Read Also:దారుణం.. లిఫ్ట్ ఇచ్చి పొరుగు యువతిపై అత్యాచారం