Snake Viral Video: పడగ విప్పిన బారీ పాము. సెకను ఆలస్యమైతే కాటేసేదే. ఆ మహిళ అత్యంత వేగంగా స్పందించడంతో కుమారుడిని కాపాడుకోగలిగింది. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పాముల వీడియోలో సహజంగానే వైరల్ అవుతుంటాయి. అవే పాములు జనావాసాల్లో చేరి..దాడికి ప్రయత్నిస్తే ఆ దృశ్యాలు ఇంకా వైరల్ అవుతాయి. అదే జరిగింది కర్నాటకలో. సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది. వీడియో చూస్తుంటే ఒళ్లు జలదరించకమానదు. ఒక్కసారి షాక్‌కు లోనవుతాం. అసలేం జరిగిందంటే..


ఓ ఇంట్లోంచి మహిళ తన 8-10 ఏళ్ల కుమారుడితో బయటకు వస్తుంటుంది. ఇంటి గుమ్మంలో రెండు మెట్లున్నాయి. ఆ మెట్లకు ఆనుకుని భారీ పాము వస్తుంటుంది. సరిగ్గా అదే సమయంలో ఆ బాలుడు కిందకు అడుగేస్తాడు. బాలుడి అడుగు చప్పుడుతో ఒక్క క్షణం వెనక్కి మళ్లిన పాము అంతలోనే పడగ విప్పుతుంది. అది చూసిన బాలుడు కంగారులో తిరిగి లోపలకు వెళ్లబోతాడు. అలా వెళ్లుంటే..ఆ పాము కాటేసేదే. కచ్చితంగా బాలుడు కాలిపై ఆ పాము కాటు పడేది. కానీ పక్కనే ఉన్న ఆ తల్లి ప్రమాదాన్ని రెప్పపాటులో గ్రహించింది. అంతే వేగంతో చటుక్కున కుమారుడిని పట్టుకుని లాగేసింది. దాంతో ఆ పాము నేరుగా వెళ్లిపోయింది. 


కేవలం రెప్పపాటులో పాము కాటు నుంచి ఆ తల్లి కుమారుడిని రక్షించుకోగలిగింది. ఆ మహిళ షార్ప్‌నెస్, తెగువకు అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ వీడియో ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది. అప్పుడే పదిలక్షలకు పైగా వీక్షించారు ట్వీట్టర్‌లో.



పాముల వీడియోలు సాధారణంగా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంటాయి. గతంలో కూడా రెండు పాముల రొమాన్స్ వీడియో ఒకటి ఇలానే వైరల్ అయింది. ఇప్పుడు ఈ వీడియో చూస్తుంటే మాత్రం ఒళ్లు గగుర్పాటు కల్గిస్తోంది. భయబ్రాంతులకు లోనవడం ఖాయం. 


Also read: ఒకరు భారత్‌లో, మరొకరు పాకిస్తాన్‌లో.. 75 ఏళ్ల తర్వాత కలిసిన అన్నదమ్ములు! హృదయాలను పిండేసే దృశ్యం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook