ఇది చనిపోతే ఇక ఆ జాతి భూమిపై ఉండదు
ప్రపంచంలోని ఏకైక తెల్ల మగ ఖడ్గమృగం `సూడాన్`.
ప్రపంచంలోని ఏకైక తెల్ల మగ ఖడ్గమృగం 'సూడాన్'. దీని వయస్సు 45 సంవత్సరాలు. ప్రస్తుతం ఇది చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. సూడాన్ జీవిత చరమాంకానికి చేరిందని కెన్యా వన్యప్రాణి సంరక్షణ అధికారులు ప్రకటించారు.
ఇటీవల సూడాన్ కాలికి తగిలిన గాయం మానకపోగా.. దాని వల్ల ఏర్పడిన ఇన్ఫెక్షన్ మరో కాలికి పాకింది. దీంతో ఇది చనిపోతే ఇక ఈ రకం రినో జాతి భూమిపై ఉండదని కెన్యా వన్యప్రాణి సంరక్షణ అధికారులలో ఆందోళన మొదలైంది. కాగా సూడాన్‌ను వేటగాళ్ళ బారి నుండి కాపాడేందుకు ఆ రినోకి కెన్యా ప్రభుత్వం జెడ్ ప్లస్ భద్రత కల్పిస్తోంది. భూమి మీద మొత్తం 3 తెల్ల రినోలు ఉండగా.. ఇందులో రెండు మాత్రమే ప్రస్తుతం కెన్యా కాకుండా బయట దేశాల్లో నివసిస్తున్నాయి. వాటి పేర్లు ఫటు, నజీన్. ఈ రినో జాతిని సంరక్షించడం కోసం.. సంతానోత్పత్తి కోసం సూడాన్ ఉండే జూకు వీటిని ఇటీవలి కాలంలో తీసుకొచ్చారు.