8 ఫిబ్రవరి 2019లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన యాత్ర సినిమా ప్రేక్షకులని ఆకట్టుకున్న సంగతి తెలిసిందే! దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి  జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన 'యాత్ర' సినిమాకి మంచి ఆదరణ లభించింది. ఈ సినిమాకి సీక్వెల్ గా యాత్ర 2 సినిమా రూపొందుతున్న సంగతి తెలిసందే!


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

యాత్ర 2 ఈవెంట్‌లో డైరెక్టర్ మహి వీ రాఘవ్ మహి వీ రాఘవ్ మాట్లాడుతూ.. 'కథను ఎంచుకునేటప్పుడు ఓ డైరెక్టర్ గా కమర్షియల్ కోణంలో సినిమాకు పెట్టిన డబ్బులు వస్తాయా..? లేదా..? అన్నది ఆలోచిస్తాం. యాత్రలో ఓ రాజకీయ నాయకుడి తన గురించి తాను తెలుసుకోవడం, ప్రజల కష్టాలను తెలుసుకోవడం, ఆయన ఏంటన్నది ప్రజలు తెలుసుకోవడం ఉంటుంది. యాత్ర 2లో 2009 నుంచి 2019 వరకు జగన్ మోహన్ రెడ్డి గారి పీరియడ్‌ను చూపిస్తాను.  ఆయన ఎదుగుదలను పొలిటికల్ డ్రామాగా చూపిస్తాను. యథార్థ సంఘటనలే అయినా కూడా జనాలను ఆకట్టుకునేలా తెరకెక్కించేందుకు ఫిక్షన్ యాడ్ చేస్తాం. 


తండ్రి ఇచ్చిన మాటను నిలబెట్టే కొడుకు అనే పాయింట్ చుట్టూ ఈ సినిమా నడుస్తుంది. రెండు గంటల్లో కథను చెప్పాలంటే కొన్ని మార్పులు చేర్పులు చేస్తాను. ఆంధ్ర ఓటర్లను తక్కువగా అంచనా వేయొద్దు. 
ఈ సినిమాతో ఓటర్లు ప్రభావితం అవుతారని అనుకోవద్దు. సినిమా చూసి ఎమోషనల్ అవుతారు.. పోలింగ్ బూత్‌లో వాళ్లకు నచ్చిన వాళ్లకు ఓటు వేస్తారు.  జగన్‌గారు ఎక్కడి నుంచి ప్రయాణాన్ని మొదలుపెట్టారు.. ఎక్కడి వరకు ఎదిగారు అన్నదే ఈ సినిమాలో చూపిస్తున్నాం. ఈ నాలుగేళ్లలో రెండు వెబ్ సిరీస్‌లు, ఓ సినిమాను తీశాను. యాత్రకి, యాత్ర 2కి కథ పరంగా ఏ సంబంధం ఉండదు. జగన్ మోహన్ రెడ్డి జీవితంలో ఎత్తుపల్లాలున్నాయి. వాటినే సినిమాలో చూపిస్తాం. జగన్ అనే ఓ రాజకీయ నాయకుడి కథను చెప్పబోతోన్నాం. 


Also Read: Hyundai SUV Sales: హ్యుండయ్ కంపెనీ క్రెటానే కాదు వెన్యూ కూడా టాప్ సెల్లర్, ధర ఎంతంటే


పొలిటికల్ సినిమాలు చేయడమే రిస్క్.. ఇలాంటి సినిమాలు ఎప్పుడు, ఏ టైంలో రిలీజ్ చేస్తామనేది ముఖ్యం. అందుకే ఎన్నికల టైంలోనే ఈ సినిమాను రిలీజ్ చేయాలని అనుకుంటున్నాం. మనం ఏది చెప్పినా కూడా నమ్మేవాళ్లు నమ్ముతారు నమ్మని వాళ్లు నమ్మరు. ఈ సినిమాను వైసీపీ వాళ్ల కోసమే తీస్తున్నామని అనుకోనివ్వండి. ఆర్జీవీ గారు తీసే వ్యూహం మాపై ఎలాంటి ప్రభావం చూపదు. 


త్వరలోనే నటీనటుల వివరాలను ప్రకటిస్తాం. శివ మేక నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. మధి సినిమాటోగ్రఫర్‌గా పని చేస్తున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సినిమాను రిలీజ్ చేయాలని భావిస్తున్నామ’ని అన్నారు. శివ మేక మాట్లాడుతూ.. ‘యాత్ర సినిమాను అందరూ సపోర్ట్ చేశారు. ఈ సినిమాను కూడా అందరూ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. నిజ జీవితంలో ఉండే పాత్రలన్నీ ఈ సినిమాలో ఉంటాయ’ని అన్నారు.
Also Read: Kishan Reddy Spech: తెలంగాణ ప్రజలే కల్వకుంట్ల కుటుంబాన్ని బహిష్కరిస్తారు: కిషన్ రెడ్డి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook