సివిల్స్ పరీక్షల్లో 624వ ర్యాంకు సాధించిన తెలుగు కుర్రాడు యడవల్లి అక్షయ్ కుమార్ తాను విజేతగా నిలవడానికి గల కారణాలను చెబుతూ.. తన అంతరంగాన్ని ఓ యూట్యూబ్ ఛానల్‌తో పంచుకున్నాడు. ఈ సందర్భంగా ఆయన కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలిపారు. అందులో అన్నింటికన్నా ఆసక్తికరమైన విషయం ఆ యువకుడు,  ప్రముఖ దర్శకుడు ఆర్జీవిని పొగడ్తలతో ముంచెత్తడం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

"రామ్ గోపాల్ వర్మ గురించి తెలుసుకున్నాక నా ఆలోచనా విధానం పూర్తిగా మారిపోయింది. పరీక్షలకు ముందు రోజు కూడా వ‌ర్మ వీడియోలు యూట్యూబ్‌లో చూసి నిద్రపోయేవాడిని. గొప్ప తత్వవేత్తలను వ‌ర్మ చదివారు. కానీ నేను అంతమందిని చదవలేదు కాబట్టి... ఆయన్నే చదివితే సరిపోతుంది అనుకున్నాను" అని అక్షయ్ తెలిపారు.  అక్షయ్ ఇచ్చిన ఇంటర్వ్యూ చూసి రామ్ గోపాల్ వర్మ సైతం రియాక్టయ్యారు. అలాగే ఆ కుర్రాడికి ఆయన జవాబిచ్చారు కూడా.


"నేను సాధారణంగా నేరస్తులకు, పోకిరి వేషాలు వేసేవారికి ఆదర్శం అంటుంటారు. అలాంటి వారందరూ ఈ సివిల్స్ టాపర్ చెప్పే మాటలు వినండి. సివిల్ ఇంజ‌నీరింగ్ రెండు సార్లు ఫెయిల్ అయినా నేను ఎందుకో గర్వపడతాను. కానీ సివిల్స్ టాపర్‌గా నిలిచిన అక్షయ్...  ఫెయిల్ అయిన సివిల్ ఇంజ‌నీర్‌ని ఆదర్శంగా తీసుకున్నాడు." అని చెబుతూ తాను అక్షయ్‌‌తో కలిసి  మాట్లాడతానని తెలిపారు వర్మ.