ఆమె మొన్నటివరకు హీరోయిన్. ఇక నుంచి నిర్మాత. ఔను.. అమలాపాల్ నిర్మాతగా మారింది. తనే హీరోయిన్ గా... నిర్మాతగా సినిమాను సెట్స్ పైకి కూడా తీసుకొచ్చింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తమిళ్ లో కెడవర్ అనే సినిమాలో నటిస్తోంది అమలాపాల్. అనూప్ పానికర్ ఈ సినిమాను డైరక్ట్ చేస్తున్నాడు. ఇందులో ఫోరెన్సిక్ సర్జన్ గా నటిస్తోంది ఈ భామ. సినిమా స్టోరీ బాగా నచ్చడంతో, కచ్చితంగా హిట్ అవుతుందనే నమ్మకంతో తనే నిర్మాతగా మారి ఈ సినిమాను తెరకెక్కిస్తోంది.


అమలాపాల్ నిర్మాణరంగంలోకి రాబోతోందనే వార్తలు ఇప్పటివి కావు. దాదాపు 6 నెలల కిందటే ఈమెపై ఇలాంటి రూమర్లు వచ్చాయి. ఆ మేరకు అప్పట్లో ఓ దర్శకుడితో అమలాపాల్ చర్చలు కూడా సాగించింది. కానీ అప్పుడు కథ సెట్ కాలేదు. ఇన్నాళ్లకు మంచి కథ దొరకడంతో అమలాపాల్ నిర్మాతగా మారిపోయింది.