బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ చేస్తోన్న సరికొత్త ప్రయోగం జీరో సినిమా. ఈ సినిమాలో బువా సింగ్ అనే ఓ మరుగుజ్జు పాత్రలో షారుఖ్ నటించగా, వీల్ చైర్‌కే పరిమితమైన ఓ దివ్యాంగురాలి పాత్రలో అనుష్క శర్మ, సినిమాలోనే నటి పాత్రలో కత్రినా కైఫ్ కనిపించనుంది. ఈ సినిమా కథాంశం విషయానికొస్తే, మరుగ్గుజ్జు అయిన బువా సింగ్ తనకు తగిన జోడిని వెతుక్కుంటున్న క్రమంలోనే అతడికి అనుష్క శర్మ ఎదురవుతుంది. వీల్ చైర్ కే పరిమితం అయిన దివ్యాంగురాలు అనుష్క శర్మను కలుస్తాడు. ఈ ప్రపంచంలో తాను కళ్లలో కళ్లు పెట్టి చూడదగిన ఏకైక బ్యూటీ ఆమె మాత్రమే అని భావిస్తున్న తరుణంలోనే నటి పాత్రలో ఉన్న కత్రినా కైఫ్ తారసపడుతుంది. ఆ తర్వాత సినిమా ఎటువంటి మలుపు తిరిగిందనేదే ఈ జీరో సినిమా అంటున్నాడు దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


కరుణ బద్వాల్‌తో కలిసి షారుఖ్ భార్య గౌరీ ఖాన్ నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 21న రిలీజ్ కానుండగా అంతకన్నా ముందుగా ఇవాళ షారుఖ్ తన 53వ పుట్టిన రోజు సందర్భంగా జీరో సినిమా ట్రైలర్‌ను విడుదల చేశాడు.