ఇంట్లో వండుకోవడానికి సమయం లేకపోయినా... వండుకునేంత ఓపిక ఒంట్లో లేకపోయినా.. ఇప్పుడు చాలామందికి గుర్తొచ్చేది ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేసేయడమే. అందులోనూ ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్స్‌పై నిత్యం ఏదో ఓ రకమైన డిస్కౌంట్ ఆఫర్స్ అందుబాటులో వుంటుండటంతో జనం కూడా ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేసి తెప్పించుకోవడానికే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. అయితే, అలా ఆఫర్లు ఉన్నాయి కదా అని విచ్చలవిడిగా ఆన్‌లైన్‌లో ఆర్డర్స్ చేసి తెప్పించుకుంటే ఏం జరుగుతుందో చూడండి అంటూ ఓ నెటిజెన్ పోస్ట్ చేసిన ఓ వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ స్టోర్ చైన్ జొమాటో టీ షర్ట్ ధరించిన ఓ డెలివరీ బాయ్, జొమాటో బ్యాగ్ లోంచి కొన్ని ఆహారపదార్థాలు తీసుకుని తిని, మళ్లీ వాటిని యధావిధిగా ప్యాక్ చేసి పెట్టిన వైనం ఈ వీడియోలో రికార్డ్ అయింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

This is what happens when you use coupon codes all the time. 😂 Watch till end. pic.twitter.com/KG5y9wUoNk



ఈ వీడియో వైరల్‌గా మారడంపై తాజాగా తమ బ్లాగ్ ద్వారా స్పందించిన జొమాటో.. అంతిమంగా అది ఓ మానవతప్పిదంగా గుర్తించినట్టు పేర్కొంది. మధురైలో ఈ ఘటన జరిగినట్టు గుర్చించిన తాము వెంటనే సదరు ఉద్యోగిని ఉద్యోగంలోంచి తొలగించినట్టు స్పష్టంచేసింది. 



ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న జొమాటో సంస్థ.. ఇకపై ఇటువంటి తప్పిదాలు జరగకుండా మరిన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకోనున్నట్టు తమ వినియోగదారులకు తెలిపింది.