10 Magnesium Rich Foods: మన శరీరం బలహీనంగా ఉన్నప్పుడు మెగ్నిషియం లోపంతో బాధపడుతున్నట్లు గుర్తించాలి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వర్తించడంతోపాటు ఎముక ఆరోగ్యానికి కూడా తోడ్పడుతుంది. మన మెదడు పనితీరుతోపాటు శరీరానికి కూడా మెగ్నిషియం ఎంతో అవశ్యకమైన ఖనిజం. మెగ్నిషియం మన శరీరంలో తక్కువగా ఉంటే కండరాల నొప్పి, తిమ్మిర్లు వస్తాయి. ఈరోజు 10 రకాల మెగ్నిషియం ఫుడ్స్ ఏవి మీ ఆహారాల్లో చేర్చుకోవాల్లో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆకుకూరలు..
మెగ్నిషియం పుష్కలంగా ఉండే ఆహారాల జాబితాలో ఆకుకూరలు ప్రధానం. పాలకూర, కాలే, దుంపలు, ఆవ ఆకుల్లో మెగ్నిషియం ఉంటుంది.


నట్స్‌..
బాదం, జీడిపప్పు, బ్రేజిల్‌ నట్స్ మెగ్నిషియం అధికంగా ఉంటుంది. ఇవి మెగ్నిషియంతోపాటు ఇతర పోషకాలు కూడా కలిగి ఉంటాయి.


విత్తనాలు..
హెల్త్‌ లైన్‌ ప్రకారం ఫ్లాక్స్‌ సీడ్స్‌, గుమ్మడి గింజలు, చియా సీడ్స్‌ లో సైతం మెగ్నిషియం అధిక మోతాదులో ఉంటుంది. అంతేకాదు వీటిలో ఫైబర్, ఒమేగా ౩ ఫ్యాటీ యాసిడ్స్‌ కూడా పుష్కలంగా ఉంటాయి.


డార్క్‌ చాకొలేట్..
డార్క్‌ చాకొలేట్స్‌ కూడా మెగ్నిషియం పుష్కలంగా ఉంటుంది. ఇందులో ఐరన్, రాగి, మెగ్నిషియం ఉంటాయి. కానీ, ఈ డార్క్‌ చాకొలేట్స్‌ ను మాత్రం మితంగా తినాలి.


తోఫు..
తోఫులో కూడా మెగ్నిషియం, ప్రొటీన్లు అధికంగా ఉంటాయి. సోయా బీన్‌ పాలతో చేస్తారు 100 గ్రాముల తోఫులో 52 ఎంజీ మెగ్నిషియం ఉంటుంది. ప్రతిరోజూ ఓ 30 శాతం తీసుకుంటే సరిపోతుంది. తోఫు తినడం వల్ల కడుపు కేన్సర్ కు రాకుండా నివారించవచ్చు.


ఇదీ చదవండి: 


ఫ్యాటీ ఫిష్‌..
కొన్ని రకాల చేపల్లో కూడా మెగ్నిషియం పుష్కలంగా ఉంటుంది.  సాల్మాన్‌, మెకరెల్, హలిబుట్‌లో మెగ్నిషియం అధికంగా ఉంటుంది.  178 గ్రాముల సాల్మాన్‌లో 53 ఎంజీ మెగ్నిషియం ఉంటుంది.


అరటిపండ్లు..
అరటిపండ్లు తక్కువ ధరలో దొరుకుతాయి. అన్ని సీజన్లలో అందుబాటులో ఉంటాయి. అరటిపండు బీపీ స్థాయిలను సైతం నిర్వహిస్తాయి.  గుండె ఆరోగ్యానికి సహాయపడతాయి. అరటిపండులో కూడా మెగ్నిషియం పుష్కలంగా ఉంటుంది. ఒక పెద్ద అరటిపండులో 37 ఎంజీ మెగ్నిషియం ఉంటుంది. అంతేకాదు అరటిపండులో విటమిన్ సీ, బీ6, మ్యాంగనీస్, ఫైబర్ కూడా ఉంటుంది.


అవకాడో..
అవకాడో లో కూడా మెగ్నిషియం ఎక్కువ మోతాదులో ఉంటుంది. అంతేకాదు అవకాడోతో మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. 


ఇదీ చదవండి: 


లెగ్యమ్స్‌..
బీన్స్‌, శనగలు, సోయా బీన్స్ లో సైతం మెగ్నిషియం, పొటాషియం, ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇందులో ఒక కప్పు ఉడకబెట్టిన నల్ల బీన్స్‌లో 120 గ్రాములు మెగ్నిషియం ఉంటుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )

 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి