Weight Gain Reasons: మారుతున్న వాతారణానికి అనుగుణంగా మానవులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యలు అధిక రక్తపోటు నుంచి రక్తంలో చక్కెర శాతం, బరువు పెరగడానికి దారి తీస్తుంది. చాలా మంది తెలిసి, తెలియక చాలా రకాల జంక్‌ ఫుడ్‌కు అలవాటు పడతారు. దీని వల్ల బరువుపెరిగి అనేక రోగాలకు కారణమవుతారని వైద్య నిపుణులు తెలుపుతున్నారు.  కాబట్టి ఈ బరువు పెరగడానికి గల నాలుగు ప్రధాన కారణాలేంటో తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


1. ఎక్కువగా బయటి ఆహారం తినడం:


బరువు పెరగడానికి అతి పెద్ద కారణం బయటి ఆహారాని ఎక్కువగా అలవాలు పడటం. బయట దొరికే ఆహారంలో చాలా రకాల కొవ్వు పదార్థాల ఉంటాయి. అంతే కాకుండా ఇందులో హానికరమైన కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. వీటిని తినడంతో బరువు పెరగడమే కాకుండా..అనేక వ్యాధులకు గురవుతారు.



2. రాత్రంతా మెలకువగా ఉండే అలవాటు మార్చుకోండి:


రాత్రంతా మేల్కొని ఉండే అలవాటు కూడా బరువు పెరగడానికి దారితీస్తుంది. ప్రస్తుతం యువత రాత్రంతా మేల్కొని ఉంటున్నారు. దీంతో అధిక బరువు పెరుగుతున్నారు. ఇదే కాకుండా రాత్రి మెలుకవతో ఉన్నప్పుడు ఆహారం తీసుకోవడం మంచిది కాదని వైద్య నిపుణులు తెలిపారు. ఇది కూడా అధిక బరువుకు దారితీసే అవకాశం ఉందని పేర్కొన్నారు.



3. కూల్‌ డ్రింక్స్‌ తాగడం:


ప్రస్తుతం కూల్ డ్రింక్స్ విచ్చల విడిగా లాభిస్తున్నాయి. దీంతో శీతల పానీయాలు తాగేందు అధికంగా అలవాటు పడుతున్నారు. ఈ అలవాటు అధిక బరువు పెరుగుదలకు కారణమవుతోంది. కూల్‌ డ్రింక్స్‌లో సుక్రోజ్ అధికంగా ఉంటుంది.. దీంతో శరీరంలో చక్కెర శాతం పెరిగి.. ఇది అధిక బరువు పెరగడానికి దారితీస్తుంది.


4. నిరంతరం ఒకే చోట కూర్చోవడం:


ఆఫీస్‌ల్లో చాలా మంది ఒకే చోట కూర్చుంటూ ఉంటారు. ఇలా కూర్చొవడం కూడా అధిక బరువుకు దారితీస్తుంది. ఎందుకంటే ఒకే చోట కూర్చునే అలవాటు మీ శారీరక కార్యకలాపాలను తగ్గిస్తుంది. దీంతో బరువు పెరిగే అవకాశాలున్నాయని వైద్య నిపుణులు తెలిపారు. ఇది అనారోగ్యానికి దారీ తీసే అవకశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు.


Also Read: Talasani Srinivas Yadav: కేటీఆర్ వ్యాఖ్యలపై ఎందుకంత ఉలికిపాటు... బొత్సకు తలసాని కౌంటర్..


Also Read: Tarsame Singh Saini Aka Taz: ప్రముఖ బాలీవుడ్ పాప్ సింగర్ తాజ్ కన్నుమూత!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook