Winter Healthy Foods Need To Consume:   శీతాకాల సమయంలో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో శరీర ఉష్ణోగ్రతలో పలు మార్పులు చోటు చేసుకుంటాయి.  అయితే చలి ఎక్కువగా ఉండే సమయంలో  చ్చగా ఉండే దుస్తులు వేసుకోవడం.. వేడి వేడిగా ఉండే ఆహార పదార్థాలు తినడానికి ఇష్టపడుతుంటాం. ఇదే సమయంలో చాలా మంది వాతావరాణంలోని తేమ పెరగడం కారణం అనార్యోగ సమస్యల బారిన పడుతుంటారు.  ఈ సమయంలో చాలా మందిలో చర్మ సమస్యలు, దగ్గు, జలుబు వస్తాయి. కాబటి ఇలాంటి సమయంలో శరీరంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాగే ఆరోగ్యరమైన ఆహారాలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. 
 
ఆరోగ్య నిపుణులు తెలిపిన వివరాలు ప్రకరం చలికాలంలో ఎక్కువగా ప్రోటీన్‌, కాల్షియం లాంటి ఆరోగ్యకరమైన ఆహార పదార్ధాలు తీసుకోవాలని సూచిస్తున్నారు. అయితే ముఖ్యంగా ఎలాంటి పదార్థాలు తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటాము అనే విషయంపై ఇప్పుడు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సూప్‌: 
చలికాలంలో చాలా మంది వేడి వేడిగా సూప్‌ తాగడానికి ఇష్టపడుతూ ఉంటారు. అయితే పచ్చి కూరగాయలతో తయారు చేసిన సూప్‌ను ప్రతి రోజు తాగడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అయితే ఈ సూప్‌లో ఎక్కువగా ఉప్పును వినియోగించకపోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 


పాలు : 
పాలల్లో శరీరానికి కావాల్సిన పోషకాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. ఇందులో B12 , A, ప్రోటీన్, కాల్షియం ఎక్కువ మోతాదులో లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజు చలి కాలంలో పాలను ఉదయం, రాత్రి పడుకునే ముందు తీసుకోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.


బ్రోకలీ : 
శీతాకాలంలో శరీరం ఆరోగ్యంగా ఉండడానికి ప్రతి రోజు పచ్చి కూరగాయలు తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా బ్రోకలీ లాంటి పోషకాలు అధిక పరిమాణంలో లభించే వెజీస్‌ తీసుకోవడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. బ్రోకలీలో విటమిన్‌ సి పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి చలికాలంలో వచ్చే  దగ్గు, జలుబు వంటి అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. 


ఫైబర్‌ అధిక పరిమాణంలో లభించే ఆహారాలు: 


చలి కాలంలో చాలా మందిలో జీర్ణక్రియ వ్యవస్థ మందగిస్తుంది. కాబట్టి దీని కారణంగా పొట్ట సమస్యలు వస్తాయి. ఇలాంటి సమస్యలు రాకుండా ఉండడానికి ఫైబర్‌ అధిక పరిమాణంలో లభించే ఆహారాలను తీసుకోవడం చాలా మంచిది. ముఖ్యంగా క్యారెట్, రూట్ వెజిటేబుల్స్ తీసుకోవడం వల్ల పొట్ట సమస్యల బారిన పడకుండా ఉంటారని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.


Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి