మనం తినే ఆహారం కేవలం ఆరోగ్యంపైనే ప్రభావం చూపదు. మన ఆలోచనను..వైఖరిని కూడా ప్రభావితం చేస్తుంది. మన మానసిక పరిస్థితిని ( State of mind ) కూడా నియంత్రిస్తుంది. అందుకే ప్రస్తుత పోటీ ప్రపంచంలో నెలకొన్న ఆందోళనను దూరం చేయడానికి ఈ ఆహార పదార్ధాలు తినమంటున్నారు నిపుణులు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


సరైన సమయంలో సరైన ఆహారం )( Food ). ఆరోగ్యంతో ( Health ) పాటు ఆలోచనను ప్రభావిత చేస్తుంది. స్టేట్ ఆఫ్ మైండ్ ను కంట్రోల్ చేస్తుంది. మనం తినే ఆహారానికి..మస్తిష్కానికి ( Connection between food and mind ) కచ్చితంగా సంబంధముందంటున్నారు నిపుణులు. కొన్ని ప్రత్యేకమైన ఆహార పదార్ధాల్ని తీసుకోవడం ద్వారా ఆందోళనను తగ్గించవచ్చని తెలుస్తోంది. ఆధునిక పోటీ ప్రపంచంలో ఒత్తడి చాలా ఎక్కువగా ఉంటోంది. దాంతో మనిషి తరచూ ఆందోళనకు (Depression ) గురవుతున్నాడు. అందుకే కొన్ని ఆహారపదార్ధాలు తినడం ద్వారా ఆందోళనను నియంత్రించవచ్చంటున్నారు.


బ్రెజిల్ నట్ ( Brazil nut )


ఇందులో ఐరన్, మెగ్నీషియం, ప్రొటీన్, కాల్షియం, సెలీనియం, విటమిన్ ఇ, విటమిన్ బి 6 ఎక్కువగా ఉంటాయి. పెద్దలకు కావల్సిన 91 ఎంసిజీల సెలీనియం కూడా ఉంటుంది. సెలీనియం అనేది మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. తద్వారా ఆందోళన తగ్గడానికి దోహదపడుతుంది. కణజాలాలకు నష్టం వాటిల్లకుండా యాంటీ ఆక్సిడెంట్ గా పని చేస్తుంది. 


గుడ్లు ( Eggs )


సండే హో యా మండే..రోజ్ ఖాయే అండే అంటున్నారు అందుకే. ప్రతిరోజూ గుడ్డు తినడం కేవలం ఆరోగ్యానికే కాదు ఆందోళనను తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది. గుడ్డు శ్లేష్మంలో అధికంగా ఉండే విటమిన్ డి, ప్రోటీన్, అమైనో ఆమ్లాలు ఎదుగుదలకు ఉపయోగపడతాయి. గుడ్డులో ఉండే ట్రిప్టోఫాన్ అనే న్యూరో ట్రాన్స్మిటర్ మానసిక పరిస్థితిని, నిద్రను, ప్రవర్తనను నియంత్రించడమే కాకుండా మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. Also read: Health tips: తులసి పాలు తాగితే.. ఈ రోగాలు మటుమాయం


గుమ్మడి విత్తనాలు ( Pumpkin )


చాలామందికి తెలియని విషయం. గుమ్మడి విత్తనాల్లో యాంటీ డిప్రెసెంట్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రించి..ఎలక్ట్రోలైట్ ను బ్యాలెన్స్ గా ఉంచుతుంది.తద్వారా ఆందోళన తగ్గుతుంది. గుమ్మడికాయ విత్తనాల్లో జింక్ అధికంగా ఉండటంతో నాడీ పెరుగుదలకు దోహదపడుతుంది. 


చేపలు ( Fish )


కొవ్వు ఆమ్లాలైన బటర్ నట్, ట్రౌట్, సాల్మన్, బంగీ వంటివి ఆందోళనను దూరం చేస్తాయి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉంటే...ఆల్ఫా లినోలెనిక్ యాసిడ్ ఉంటుంది. ఇవి న్యూరో ట్రాన్స్మిటర్లను ప్రేరేపిస్తాయి. మెదడు ఆరోగ్యంగా ఉండేందుకు సహకరిస్తాయి.


డార్క్ చాక్లెట్ ( Dark Chocolate )


డార్క్ చాక్లెట్ అందరికీ ఇష్టమైంది. రుచికరమైంది. మీరు ఒత్తిడిలో నైనా..ఆందోళనలో నైనా ఉంటే డార్క్ చాక్లెట్ ముక్క ఒకటి తినండి చాలు..రిలాక్స్ అయిపోతారు. మీ మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. డార్క్ చాక్లెట్ లో కోకో ఎక్కువగా తినండి. రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. న్యూరో ఇన్ ఫ్లమేషన్ ను తగ్గిస్తుంది. Also read: Fenugreek Seeds: మెంతులతో ఆ సమస్యలకు చెక్ పెట్టవచ్చు