5 Health Advantages Of Eating Guava: జామపండు తీయ్యగా ఉంటుంది. ఇందులో ఎన్నో పోషకాలు ఉంటాయి. జామపండులో విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది చర్మానికి మంచిది. ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరుస్తాయి. జామపండు జీర్ణ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. జామపండులో విటమిన్ సీ పుష్కలంగా ఉంటుంది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తికి తోడ్పడతాయి.  సీజనల్ ఇన్పెక్షన్ల నుంచి కూడా జామపండు రక్షిస్తుంది. దీంతో కలిగే మరో 5 ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం. సాధారణంగా జామలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇందులో చక్కెర స్థాయిలు కూడా తక్కువగా ఉంటాయి. జామలో సమతుల ఆహారం ఉంటుంది. ఇది బరువు పెరగకుండా కాపాడుతుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మెరుగైన జీర్ణక్రియ..
జామలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది మంచి జీర్ణక్రియకు ప్రేరేపిస్తుంది. జామకాయను డైట్లో చేర్చుకోవడం వల్ల మలబద్ధకం సమస్య కూడా చెక్‌ పెట్టొచ్చు. జామ తింటే ప్రాణాంతక డయేరియాకు కూడా చెక్ పెట్టొచ్చు. కడుపు సంబంధిత సమస్యలతో బాధపడేవారు జామను తినాలి. 


నొప్పిరహిత పీరియడ్స్..
జామ ఆకులో స్పాస్‌మొలైటిక్ గుణాలే ఉంటాయి. ఇవి పీరియడ్స్‌ సమయంలో వచ్చే తిమ్మిరి, నొప్పికి చెక్ పెడతాయి. యూరినరీ సమస్యలకు కూడా జామకాయలు చెక్‌ పెడతాయి. 


బలమైన ఇమ్యూనిటీ వ్యవస్థ..
జామకాయలో విటమిన్ సీ పుష్కలంగా ఉంటుంది. ఇది ఇమ్యూనిటీ వ్యవస్థను కూడా బలపరుస్తుంది. శరీర కణాలను హానికరమైన బ్యాక్టిరియా నుంచి రక్షించడంలో కీలకపాత్ర పోషిస్తుంది. జామ ప్రాణాంతక కేన్సర్, గుండె సమస్యలు, ఆర్థ్రరైటీస్‌ అభివృద్ధి చెందకుండా నివారిస్తుంది. పండిన జామ తింటే విటమిన్ సీ మరీ ఎక్కువగా ఉంటుంది.


ఇదీ చదవండి: పీచు పండు తింటే ఈ శక్తివంతమైన ఆరోగ్య ప్రయోజనాలు.. గర్భిణులకు సుఖప్రసవం ఖాయం


గుండె ఆరోగ్యం...
జామ ఆకుల్లో పొటాషియం, ఫైబర్, పాలిసాక్కరైడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది బీపీ, కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గిస్తాయి.  అంతేకాదు జామ ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి కాపాడుతుంది. హార్ట్‌ ఫెయిల్యూర్‌ కాకుండా యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది జామ. వీటితో టీ తయారు చేసుకుని తాగవచ్చు. ఇది అథెరోస్క్లెరోసిస్‌ను నివారించడంలో సహాయపడుతుంది. జామలో బ్లడ్‌ ప్రెజర్‌లో స్థాయిలు పెరగకుండా కాపాడతాయి.


ఇదీ చదవండి: పీరియడ్స్‌ మిస్సవ్వకూడదంటే ఈ 5 టిప్స్‌ పాటించండి.. సరైన టైమ్‌కు వచ్చేస్తుంది..


కేన్సర్ నివారిస్తుంది..
జామలో యాంటీ ఆక్సిడెంట్లు కేన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇది బ్రేస్ట్‌, ప్రొస్టేట్‌ కేన్సర్ నివారిస్తుంది.  జామలో విటమిన్ సీ, లైకోపీన్ పుష్కలంగా ఉంటుంది. జామలో ఫైబర్, కొలన్ కేన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )

 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter