5 Mistakes leads High BP: హైపర్ టెన్షన్, వయసు వారిగా మారుతూ ఉంటుంది. బీపీ లెవెల్స్ ని పెంచుతూ ఉంటుంది. బీపీ లెవెల్స్ పెరిగినప్పుడు ఒక వ్యక్తి బ్లడ్ ప్రెషర్ తో బాధపడుతూ ఉంటాడు.హై బ్లడ్ ప్రెషర్ అనేది సైలెంట్ కిల్లర్ ఇది ప్రాణాంతక వ్యాధులకు దారితీస్తుంది. బీపీ లెవెల్స్ అదుపులో పెట్టుకోవడం ఆరోగ్యానికి వంతం సమయానికి మందులు తీసుకోవాల్సి ఉంటుంది. జీవన శైలిలో మార్పులు చేసుకోవాలి. మనం తీసుకునే ఆహారం కూడా బీపీ స్థాయిలపై ఆధారపడి ఉంటాయి. కొన్ని రకాల ఆహారాలకు దూరంగా ఉండాలి అవేంటో తెలుసుకుందాం


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చక్కెర పానీయాలు..
చక్కర అధిక మోతాదులో ఉండే పానీయాలు బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ ని పెంచేస్తాయి. హైపర్‌టెన్షన్‌ రోగానికి దారితీస్తుంది ఇవి కొలెస్ట్రాల్ లెవెల్స్ ని కూడా పెంచుతాయి. దీంతో డయాబెటిస్ గుండె సమస్యలకు కూడా దారి తీస్తుంది. బీవరేజెస్‌ తీసుకోకుండా దూరంగా ఉండాలి. ఎండకాలం అతిగా కూల్‌డ్రింక్‌ తీసుకోవడం జరుగుతుంది. కానీ, ఇది కూడా హైబీపీకి దారితీస్తుంది.


ఆల్కహాల్..
అధిక మోతాదులో ఆల్కహాల్ తీసుకోవడం కూడా బీపీ లెవెల్స్ పెరగడానికి ప్రమాద స్థాయికి చేరుకోవడానికి ప్రధాన కారణంగా మారుతుంది. అధిక మోతాదులో తీసుకోవడం బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ హఠాత్తుగా పెరుగుతాయి. రాను రాను ఇది ప్రాణాంతక పరిస్థితికి దారి తీస్తుంది.


తక్కువ మోతాదులో పాలు..
సాధారణంగా పాలు ఆరోగ్యకరం ఇది గుండె ఆరోగ్యానికి మంచిది బీపీ లెవెల్స్ ని తగ్గిస్తుంది. ఇందులో క్యాల్షియం మెగ్నీషియం, పొటాషియం ఉంటుంది. ప్రతిరోజు పాలు తాగడం వల్ల హై బీపీ తో బాధపడే వారికి మంచి ఉపశమనం లభిస్తుంది.


ఇదీ చదవండి: ఈ 10 ఫుడ్స్‌తో మీకు హార్ట్‌ బ్లాక్‌ సమస్యే ఉండదు.. గుండె పదికాలలపాటు పదిలం..


ఎనర్జీ డ్రింక్స్..
ఎనర్జీ డ్రింక్స్ లో కూడా చక్కెర లెవెల్స్ అధిక మోతాదులో ఉంటాయి 21 నుంచి 34 గ్రాములు ఒక ఔన్సు ఉంటుంది. ముఖ్యంగా ఇందులో సుక్రోజ్, గ్లూకోస్, ఎక్కువ మోతాదులో ఫ్రక్టోజ్ కార్న్‌ సిరప్ ఉంటుంది. ఈ ఎనర్జీ డ్రింకులు తీసుకోవడం వల్ల బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ హఠాత్తుగా పెరిగిపోయి డయాబెటిస్, ఒబేసిటీకి కారణం కావచ్చు.


ఇదీ చదవండి: త్రిఫలనీటిని పరగడుపున తీసుకుంటే కలిగే లాభాలు అన్నీ ఇన్నీ కావు..


కాఫీ..
కొంతమందికి కాఫీ ఎక్కువగా తాగే అలవాటు ఉంటుంది అది కూడా ఆరోగ్యం పై చెడు ప్రభావాలు చూపిస్తుంది ఇది హఠాత్తుగా బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ పెంచుతుంది దీంతో యాంగ్జైటీ, వణుకుడు ఇన్‌సోమియా సమస్య కూడా రావచ్చు .కెఫెయిన్ తీసుకోవడం వల్ల బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ సడన్‌ పెంచేస్తాయి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )

 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter