5 Super Foods: ఇప్పుడున్న పరిస్థితుల్లో జనాలు ఏదో ఒక వ్యాధితో సతమాతను అవుతూనే ఉన్నారు. ఈ వ్యాధులకు ప్రధాన కారణం తీసుకునే ఆహారంలో సరైన ప్రోటీన్లు లేకపోవడం వల్లేనని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. చాలామంది రోజు తీసుకునే ఆహారంలో అనారోగ్యకరమైన ఆహారాలే ఎక్కువ తీసుకోవడం ప్రస్తుతం ట్రెండ్ గా మారింది. ముఖ్యంగా వీరు వీధుల్లో లభించే నూనెతో కలిగిన ఆహారాలను ఎక్కువ తీసుకోవడం విశేషం. అయితే ఇదే క్రమంలో తీవ్ర గుండె సమస్యలకు, మధుమేహం సమస్యలకు గురవుతున్నారు. మరికొందరైతే ఆహారం తీసుకుంటున్నారు కానీ ఎలాంటి పోషకాలు లేని ఆహారాలు తీసుకుంటున్నారు. వీటి వల్ల శరీరానికి ఎలాంటి ప్రయోజనం ఉండదు. కాబట్టి వ్యాధుల బారిన పడకుండా తీసుకొని ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా కొన్ని రకాలు ఆహారాలను కూడా తీసుకోవాలని వారు చెబుతున్నారు. ఆహారాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ ఆహారాలను ఆరోగ్య నిపుణులు సూపర్ ఫుడ్ గా పిలుస్తున్నారు. అయితే సూపర్ ఫుడ్ వల్ల శరీరానికి కలిగే ప్రయోజనాలు, ఇతర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..


సూపర్ ఫుడ్స్ ఇవే:


1. ఉసిరికాయలు:
 ఉసిరికాయల్లో శరీరానికి అవసరమైన చాలా రకాల పోషకాలు లభిస్తాయి. వీటిలో శరీర రోగ నిరోధక శక్తిని పెంచే లక్షణాలు అధిక పరిమాణంలో ఉంటాయి. కాబట్టి వీటిని ఆహారంగా తీసుకుంటే అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటారని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.


2. నెయ్యి:
19వ శతాబ్దంలో నెయ్యి ఎంతో ప్రాచుర్యంలోకి వచ్చింది. ఆ కాలంలో ప్రతి వంటకంలో నెయ్యిని వినియోగించేవారు. అయితే నెయ్యిని ఆహారంలో భాగంగా వినియోగిస్తే శరీరంలోని హానికరమైన గ్లైసెమిక్ సూచికలను తగ్గిస్తుందని ఆరోగ్య నిపుణులు పేర్కొన్నారు. అంతేకాకుండా ఇందులో చాలా రకాల పోషక విలువలు ఉంటాయి కాబట్టి ఇది శరీర అభివృద్ధి కూడా తోడ్పడుతుంది.


3. కొబ్బరి నూనె:
భారతీయుల్లో చాలామంది కొబ్బరినూనెను వెంట్రుకల దృఢత్వాన్ని పెంచేందుకు ఉపయోగిస్తారు. కానీ వీటిని వంటకాల్లో వినియోగిస్తే శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో ఉండే మూలకాలు పెరుగుతున్న పరుగును సులభంగా నియంతిస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు వంటకాల్లో ఈ నూనెను వినియోగించవచ్చు.


4. రాగులు:
తృణధాన్యాల్లో అతి ముఖ్యమైన వాటిలో రాగులు ఒకటి. ఇందులో శరీరానికి అవసరమైన చాలా రకాల పోషకాలు లభిస్తాయి. అంతేకాకుండా వీటిల్లో విటమిన్ డి, ఐరన్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి వీటిని ఆహారంలో వినియోగిస్తే మంచి ప్రయోజనాలు చేకూరుతాయి. ముఖ్యంగా మధుమేహం ఉన్నవారు వీటిని తీసుకుంటే డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది.


5. పసుపు:
చాలామంది భారతీయులు పసుపును ఓ యాంటీబయటిక్ గా వాడుతారు. ఇందులో శరీరానికి మేలు చేసే చాలా రకాల పోషకాలు ఉంటాయి. అంతేకాకుండా రోగ నిరోధక శక్తిని పెంచే గుణాలుంటాయి. కాబట్టి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు పసుపును ఆహారంలో అధిక పరిమాణంలో వినియోగించాలి. ఇది వివిధ రకాల క్యాన్సర్లను కూడా నియంత్రించే శక్తిని కలిగి ఉంటుంది. కాబట్టి పసుపును ఆహారాల్లో తప్పకుండా వినియోగించాలి.


Also Read: Telugu Movies this Week: ఈ వారం థియేటర్లో, ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాలివే!


Also Read: Amala Paul on Tollywood: టాలీవుడ్ పై షాకింగ్ కామెంట్స్.. నెపోటిజం, రొట్ట సినిమాలు అంటూ



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి