Acidity Home Remedies: నేటి అనారోగ్యకరమైన జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా  అజీర్ణం, మలబద్ధకం, గ్యాస్, బర్నింగ్ సెన్సేషన్, ఎసిడిటీ వంటి పొట్ట సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి తప్పకుండా పలు ఇంటి చిట్కాలను పాటించాల్సి ఉంటుంది. దీని కోసం ఇంట్లో లభించే మసాలా దినుసులను వినియోగించాల్సి ఉంటుంది. వాటిల్లో ఉండే గుణాలు అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగించి జీర్ణక్రియ సమస్యలను తగ్గిస్తుంది. అంతేకాకుండా కొలెస్ట్రాల్‌ను కూడా తగ్గించడానికి ప్రభావవంతంగా సహాయపడతాయి. ప్రస్తుతం పొట్ట సమస్యలతో బాధపడుతున్నవారు ఎలాంటి మసాలా దినుసులను వినియోగించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జీర్ణక్రియ సమస్యలను తగ్గించే సుగంధ ద్రవ్యాలు ఇవే:
మెంతులు:

మెంతుల్లో ఒక టీస్పూన్ మెంతి గింజల్లో నల్ల ఉప్పు కలపాలి. వాటిని  ఒక గ్లాసు గోరువెచ్చని నీటితో కలిపి తాగడం వల్ల పొట్ట సమస్యల నుంచి తక్షణ ఉపశమనం లభిస్తుందని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో పొట్టను శుభ్రం చేసే చాలా రకాల గుణాలు లభిస్తాయి. కాబట్టి అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజూ ఇలా మెంతి నీటిని తాగాల్సి ఉంటుంది.


అల్లం:
గ్యాస్ సమస్య, కడుపులో తిమ్మిర్ల సమస్యలతో బాధపడేవారు అల్లం టీని తాగడం వల్ల సులభంగా ఆ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. జీర్ణక్రియను మెరుగుపరచే చాలా రకాల ఔషధ గుణాలు లభిస్తాయి. కాబట్టి పొట్ట సమస్యల నుంచి తక్షణ ఉపశమనం లభిస్తుంది.


ఏలకులు:
ఎసిడిటీ సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఆహారాల్లో ఏలకులు లేదా జీలకర్ర ఎక్కువగా వినియోగించాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు పొట్ట తీవ్ర సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాకుండా పొట్టలోని మంటను కూడా తగ్గించడానికి సహాయపడుతుంది.


(నోట్‌: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)


Also Read:  Pawan Kalyan: చంద్రబాబుకు అండగా పవన్ కళ్యాణ్‌ సపోర్ట్.. వైసీపీ పాలనలోనే ఇలా చూస్తున్నాం..


Also Read: Interest Free Loan: ఈ రాష్ట్ర రైతులకు గుడ్‌న్యూస్.. రూ.5 లక్షల వరకు వడ్డీలేని రుణం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook