Acidity Relief Remedies: ఎసిడిటీ సమస్యను దూరం చేసుకునేందుకు ఈ చిట్కాలను పాటించండి!
Acidity Relief Remedies: మీరు ఎసిడిటీతో బాధపడుతున్నారా? ఎన్ని రెమిడీస్ పాటించినా లాభం లేకపోయిందా? అయితే ఈ నేచురల్ చిట్కాలను పాటిస్తే ఎసిటిడీ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. అవేంటో మీరే తెలుసుకోండి.
Acidity Relief Remedies: మారుతున్న జీవనశైలి, ఉరుకుల పరుగుల జీవితంలో ఆహారపు అలవాట్లు తీవ్రంగా మారుతున్నాయి. ఉద్యోగాల్లో బిజీగా ఉంటూ చాలా మంది టైమ్ కు తినడమే మానేశారు. దీని వల్ల కడుపులో గ్యాస్ లేదా ఎసిడిటీ సమస్య వచ్చే అవకాశం ఉంది. ఈరోజుల్లో చాలామంది ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారు. దీన్ని నివారించుకునేందుకు అనేక మార్గాలను ఎంచుకుంటున్నా.. వాటిలో సరైన ఫలితం రావడం లేదు. అయితే ఆ సమస్య పరిష్కారం కావడానికి ఈ చిట్కాలు పాటిస్తే సరి!
ఎసిడిటీకి కారణం
ఆహారాన్ని తీసుకునేప్పుడు గాలి కొద్దిగా మీ కడుపులోకి వెళ్లోంది. మీరు తిన్న ఆహారాన్ని జీర్ణం చేసే క్రమంలో అది గ్యాస్ గా మారుతుంది. ఆ గ్యాస్ మీ కడుపు చుట్టూ ఒత్తిడిని కలిగిస్తుంది. దీని వల్ల మీకు త్రేనుపులు వస్తాయి. ఈ సమస్య తీవ్రతరమైతే అది పెద్దప్రేగు క్యాన్సర్ కు దారితీయవచ్చు.
వేడి నీరు
మీకు ఎసిటిడీ సమస్యతో బాధపడుతున్నట్లయితే.. ప్రతిరోజూ గోరువెచ్చని నీరు లేదా హెర్బల్ టీ తాగడం వల్ల మీకు ఉపశమనం లభిస్తుంది. అల్లం, పుదీనా కలిపిన నీరు దీనిపై చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. యాపిల్ సైడర్ వెనిగర్ ఎసిడిటీని తగ్గించడంలో సహాయపడుతుంది.\
ఎసిడిటీ నుంచి ఉపశమనం
కడుపులో గ్యాస్ లేదా అసిడిటీ సమస్య నుండి ఉపశమనం పొందడానికి, శీతల పానీయాలు తాగడం, టీ లేదా పాల ఉత్పత్తులను తీసుకోవడం మానుకోవాలి. అలాగే ఉల్లిపాయలు, బంగాళదుంపలు, పాలకూర మొదలైనవి తినకూడదు. ఇవి కడుపులో ఎక్కువ గ్యాస్‌ను సృష్టిస్తాయి. తినే సమయంలో మాట్లాడడం మానుకోవాలి. దాని వల్ల కడుపులోకి ఎక్కువ గాలి చొరబడకుండా ఉంటుంది. మసాలా పదార్థాలు కూడా ఎసిటిడీకి ప్రధాన కారణం. అందువల్ల వాటిని దూరంగా ఉంచితే మేలు.
Also Read: White Hair Treatment: తెల్లజుట్టు నల్లగా మారేందుకు ఈ 3 ఇంటి చిట్కాలను పాటించండి!
Also Read: Black Pepper Benefits: నల్ల మిరియాల వల్ల శరీరానికి ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook