Almond Milk Health Benefits: బాదం పాలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఇందులో ఏ మాత్రం సందేహమే లేదు. అయితే అదే బాదం లేదా బాదం పాలను శృతి మించి తీసుకుంటే అనర్ధాలే..అవేంటో తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఫైబర్, ప్రోటీన్, విటమిన్ ఇ, మెగ్నీషియం, మాంగనీస్, కాపర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. క్రమం తప్పకుండా తీసుకుంటే ఎముకలకు పటిష్ఠత, బరువు అదుపులో ఉండటం, మానసికంగా సమతుల్యత, గుండె జబ్బులు, కేన్సర్ నియంత్రణలో ఉంటాయి. అదే సమయంలో మితిమీరి తీసుకుంటే మాత్రం చాలా సమస్యలు తలెత్తుతాయంటున్నారు వైద్య నిపుణులు. ఆ సమస్యలేంటనేది పరిశీలిద్దాం.


బాదం అధికంగా తీసుకుంటే..ఇందులో ఉండే మినరల్స్, న్యూట్రియంట్స్ అవసరానికి మించితే వాంతులు రావడం, కడుపులో అసౌకర్యం, విరేచనాలు, పేగు అనారోగ్యం వంటి జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. అందుకే మితంగా తీసుకోవడం మంచిది. నట్స్ అలర్జీ ఉన్నవారు బాదం పాలు తీసుకోకపోవడమే మంచిది. లాక్టోస్ అలర్జీ ఉన్నవారు కూడా బాదం పాలకు దూరంగా ఉంటే మంచిది. ఆవుపాలలో కంటే బాదం పాలలో చక్కెర స్థాయి ఎక్కువగా ఉంటుంది. అందుకే డయాబెటిస్ సమస్య ఉన్నవారు మితంగా తీసుకోవాలి.


బాదం పాలను గోయిట్రోజెనిక్ ఆహారంగా పరిగణిస్తారు. అంటే థైరాయిడ్ సమస్యకు బాదం పాలు కారణమవుతాయి. బాదం పాలను పరిమితికి మించి తీసుకుంటే థైరాయిడ్‌కు హాని కల్గించే రసాయనాలు విడుదలయ్యేందుకు కారణమవుతాయి. బాదంపాలను కొంతమంది అవగాహన లేక..తల్లిపాలకు ప్రత్యామ్నాయంగా భావిస్తుంటారు. కానీ బాదం పాలు పిల్లలకు  అంత మేలు చేసేది కానే కాదు. పిల్లలకు అవసరమైన పోషకాలు ఇందులో ఉంతగా ఉండవు. బాదం పాలు ఎప్పటికీ తల్లిపాలకు ప్రత్యామ్నాయం కావనే సంగతి గుర్తుంచుకోవాలి. 


Also read: Black Coffee Health Benefits: బ్లాక్ కాఫీతో అద్భుత ప్రయోజనాలు, ఒబెసిటీకు పరిష్కారం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook