Almonds Benefits: నానబెట్టిన బాదం రోజూ తింటే ఏమౌతుందో తెలుసా
Almonds Benefits: అంతర్గత ఆరోగ్యంతో పాటు బాహ్య ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం. ముఖ్యంగా ఆధునిక జీవనశైలిలో వృద్ధాప్య ఛాయల నుంచి బయటపడాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. సదా నిత్య యౌవనంగా ఉండాలని కోరుకుంటుంటారు. ఇది అసాధ్యమేం కాదు..రోజూ కొన్ని గింజలు తింటే తప్పకుండా చర్మం కళకళలాడుతుంది.
Almonds Benefits: మనిషి ఆరోగ్యం అనేది ప్రకృతిలో లభించే వివిధ రకాల పదార్ధాల్లో సమృద్ధిగా ఉంటుంది. ఈ పదార్ధాల్లో లభించే వివిధ రకాల పోషకాల కారణంగా మనిషి సంపూర్ణ ఆరోగ్యం ఉంటుంది. కేవలం అంతర్గత ఆరోగ్యమే కాకుండా బాహ్య ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ముఖ్యంగా చర్మ సంరక్షణకు కావల్సిన పోషకాలు ఇందులో సమృద్దిగా ఉంటాయి.
మనిషి ఆరోగ్యానికి కావల్సిన పోషకాలు పెద్దఎత్తున లభించేవి డ్రై ఫ్రూట్స్. వీటిలో ప్రధానంగా చెప్పుకోవల్సింది బాదం గురించి. ఇవి ఆరోగ్యపరంగా అద్భుతమైన ప్రయోజనాలు కలిగి ఉంటాయి. రోజూ క్రమం తప్పకుండా ఉదయం వేళ కొన్ని బాదం గింజలు తినడం అలవాటు చేసుకుంటే ఆరోగ్యపరంగా చాలా ప్రయోజనాలు కలుగుతాయి. రోజూ రాత్రి పూట నానబెట్టి ఉదయం తినాలి. ఇలా చేయడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఫలితంగా మలబద్ధకం వంటి సమస్యలు దూరమౌతాయి. బరువు నియంత్రణకు కూడా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇందులో విటమిన్ ఇ ఎక్కువగా ఉండటం వల్ల ఇది చర్మాన్ని నిగనిగలాడేలా చేస్తుంది. చర్మాన్ని యౌవనంగా ఉంచుతుంది. బాదం రోజూ తినడం వల్ల రక్తపోటు కూడా నియంత్రణలో ఉంటుంది.
రోజూ క్రమం తప్పకుండా నానబెట్టిన బాదం తినడం వల్ల కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది. చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఏజీయింగ్ ప్రక్రియను నిరోధిస్తాయి. వృద్ధాప్య ఛాయల్ని దూరం చేస్తుంది. రోజూ బాదం తినడం వల్ల ఇమ్యూనిటీ సైతం పెరుగుతుంది. కండరాలు పటిష్టమౌతాయి. బాదం క్రమం తప్పకుండా తినడం వల్ల జీర్ణ వ్యవస్థ బలపడుతుంది.
ఇందులో ఉండే కాల్షియం, ఐరన్ వంటి పోషకాల కారణంగా ఎముకలు బలంగా ఉంటాయి. వయస్సు పెరిగేకొద్దీ ఎముకల్లో ఏర్పడే డొల్లతనం దూరమౌతుంది. అందుకే బాదంను సూపర్ ఫుడ్ అంటారు. ఇందులో ప్రోటీన్లు పెద్దఎత్తున ఉంటాయి. ప్రతి 100 గ్రాముల బాదంలో 18 గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది. ఇది ఆరోగ్యానికి చాలా అవసరం.
Also read: Milk Powder: ఈ టిప్స్ తో మిల్క్ పౌడర్ చేస్తే అచ్ఛం బయటకొన్నట్టే వస్తుంది ...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.