Almonds Side Effects: బాదంను అతిగా తింటున్నారా.. ఈ 5 రకాల అనారోగ్య సమస్యలు తప్పవు..!
Almonds Side Effects: బాదం అనేది ఒక డ్రై ఫ్రూట్, ఇది భారతదేశం మాత్రమే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలు దీనిని తినడానికి మక్కువ చూపుతారు. ఇందులో ఉండే పోషకాలు శరీరానికి చాలా మేలు చేస్తాయి. కాబట్టి వైద్యులు, పెద్దలు కూడా దీనిని తినమని సూచిస్తారు.
Almonds Side Effects: బాదం అనేది ఒక డ్రై ఫ్రూట్, ఇది భారతదేశం మాత్రమే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలు దీనిని తినడానికి మక్కువ చూపుతారు. ఇందులో ఉండే పోషకాలు శరీరానికి చాలా మేలు చేస్తాయి. కాబట్టి వైద్యులు, పెద్దలు కూడా దీనిని తినమని సూచిస్తారు. బాదంపప్పు తింటే మెదడుకు పదును, జ్ఞాపకశక్తి మెరుగవుతుందని ఆయుర్వేద శాస్త్రం చెబుతోంది. బాదం పప్పును
తినడం వల్ల ఎన్ని ప్రయోజనాలున్నాయో.. అన్నే నష్టాలు కూడా ఉన్నాయి. అవును వీటిని అతిగా తినడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని నిపుణుల అభిప్రాయపడుతున్నారు. కావున బాదం పప్పులు ఎక్కువగా తినడం వల్ల కలిగే నష్టాలను ఇప్పుడు తెలుసుకుందాం..
బాదం పప్పులు ఎక్కువగా తినడం వల్ల కలిగే నష్టాలు:
1. కిడ్నీలలో స్టోన్ రిస్క్ పెరుగుతుంది:
బాదంపప్పును ఎక్కువగా తినడం కూడా కిడ్నీలకు ఆరోగ్యానికి మంచిది కాదు. ఈ డ్రై ఫ్రూట్‌లో ఆక్సలేట్ ఉంటుంది. ఇది మూత్రపిండాల్లో రాళ్లకు దారితీస్తుంది.
2. రక్తస్రావం :
బాదంపప్పులు విటమిన్ ఇ అధికంగా ఉంటుంది. కావున ఈ డ్రై ఫ్రూట్‌ని ఎక్కువగా తింటే.. విటమిన్ ఓవర్ డోస్ అయ్యి.. రక్తస్రావం వంటి తీవ్రమైన వ్యాధులకు కారణామవుతుంది.
3. శరీరంలో టాక్సిన్స్ పెరుగుతాయి:
బాదంపప్పును ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో టాక్సిన్స్ పెరిగి.. పొట్ట సమస్యలకు దారీ తీస్తుంది. గర్భిణీ స్త్రీలు దీనిని తినకూడదని సూచించడానికి కారణం ఇదే.
4. మలబద్ధకం:
బాదంపప్పులో ఫైబర్ శాతం అధికంగా ఉంటుంది. కావున దీనిని అతిగా తినడం వల్ల మలబద్ధకం, జీర్ణక్రియలో సమస్యలు వస్తాయి.
5. ఊబకాయం:
బరువు పెరగడం వల్ల ఇబ్బంది పడుతుంటే.. బాదంపప్పును ఎప్పుడూ ఎక్కువగా తినకూడదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఎందుకంటే ఇది బరువును పెంచి.. పొట్ట చుట్టూ కొవ్వును పెంచేందుకు దోహదపడుతుంది.
(NOTE: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Read also: Coivd New Wave: కొవిడ్ కొత్త వేవ్ తో రోజుకు 50వేల కేసులు.. మాస్క్ లేకుంటే అంతే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.