Almonds Side Effects: బాదం రోజు తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. అందుకే చాలామంది ప్రతిరోజు ఉదయాన్నే ఖాళీ కడుపుతో నానబెట్టిన బాధను తింటూ ఉంటారు. ఎండిన బాదం కంటే నానిన బాదం తినడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయి. దీనిని దృష్టిలో పెట్టుకొని చాలామంది విచ్చలవిడిగా బాదం ఎక్కువగా తినేస్తున్నారు. నిజానికి బాధ ఎక్కువగా తినడం వల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువగా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అతిగా బాదాం తింటే వాటిలో ఉండే పోషకాలే అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులకు దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు. కొంతమందిలోనైతే బాదం రోజు అతిగా తినడం వల్ల పొట్ట సమస్యలు కూడా వస్తున్నాయని ఇప్పటికే చాలా కంప్లైంట్స్ వచ్చాయి. నిజానికి బాదం ఎక్కువగా తినడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయా? వస్తే ఎలాంటి సమస్యలు వస్తాయో.. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బాదం ఎక్కువగా తినడం వల్ల కలిగే దుష్ప్రభావాలు:
జీర్ణ సమస్యలు: 

కొంతమందిలో బాదాం అతిగా తినడం వల్ల అందులో ఉండే ఫైబర్ అధిక మోతాదులో శరీరానికి లభించి జీర్ణ క్రియపై ప్రభావం చూపుతోందట. దీని కారణంగా మలబద్ధకంతో పాటు పొట్ట ఉబ్బరం, అజీర్ణం వంటి సమస్యలకు దారి తీసే ఛాన్స్ ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇంకొంతమందిలోనైతే ఇతర పొట్ట సమస్యలు కూడా వస్తున్నాయి.


కొలెస్ట్రాల్ పెరగడం: 
బాదాన్ని ఆహారంలో అతిగా తీసుకోవడం కారణంగా ఇందులో ఉండే మంచి కొవ్వులే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ను పెంచే అవకాశాలు ఉన్నాయి. దీని కారణంగా అధిక బరువుతో పాటు ఇతర గుండె సమస్యలు కూడా వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి ఇప్పటికే హెవీ కొలెస్ట్రాల్ తో బాధపడుతున్న వారు అతిగా బాధలు తినడం మానుకోండి. 


అలర్జీ సమస్యలు:
కొంతమందిలో బాదంపప్పు అతిగా తినడం వల్ల చర్మంపై అలర్జీ వంటి సమస్యలకు దారితీస్తుంది. ఇప్పటికే చాలామందిలో వీటిని అతిగా తినడం వల్ల చర్మం ఎర్రబడడం, ఉబ్బడం, మొటిమలు మచ్చలు వంటి సమస్యలు వచ్చాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇక మరికొంతమందిలోనైతే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది బట్టి సమస్యలు కూడా తలెత్తవచ్చట.


సోడియం హెవీ: 
బాదంపప్పులో సోడియం ఎక్కువ మోతాదులో లభిస్తుంది. కాబట్టి ఇప్పటికే అధిక రక్తపోటు సమస్యలతో బాధపడుతున్న వారు ఎక్కువగా బాధపడును తినడం వల్ల.. ముఖ్యంగా రోజు మితిమీరి తినడం వల్ల రక్తపోటు పెరిగే అవకాశాలు ఉన్నాయి. దీంతోపాటు గుండె సమస్యలు కూడా రావచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు..


కాలేయం సమస్య:
ఎక్కువగా బాదం తింటే కాలేయంపై కూడా తీవ్ర ఒత్తిడి పడుతుంది. దీనికి కారణంగా కాలేయం పూర్తిగా దెబ్బతిని అనేక దీర్ఘకాలిక వ్యాధులకు దారితీస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే కాలయ సమస్యలతో బాధపడుతున్న వారు అతిగా బాదం పప్పులు తినడం మానుకోండి..


విటమిన్ విష ప్రభావం: 
బాదం పప్పులో అధిక మోతాదులో విటమిన్ ఈ లభిస్తుంది. కాబట్టి వీటిని రోజు అతిగా తింటే విటమిన్ E విచ్చలవిడిగా శరీరంలో పెరిగిపోయి.. విష ప్రభావానికి దారి తీసే ఛాన్స్ ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే వివిధ రకాల సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న వారు అతిగా బాదంపప్పు తీసుకోవడం మంచిది కాదు.


Also Read: Trump vs Kamala Harris: అమెరికా అధ్యక్ష పదవి రేసులో ఎవరు గెలిస్తే భారతీయులకు మేలు జరుగుతుంది..?  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.