Aloe Vera Juice Benefits: కలబందలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. కలబంద మన ఆరోగ్యానికి, చర్మానికి, జుట్టుకు అనేక రకాల ప్రయోజనాలను అందిస్తుంది. దీన్ని వివిధ రకాలుగా ఉపయోగించవచ్చు. కలబంద జ్యూస్ తాగడం వల్ల ఆరోగ్యం, అందం కూడా మెరుగవుతుంది. ఇందులో విటమిన్ - సి తో పాటు సహజ యాంటీఆక్సిడెంట్ పుష్కలంగా లభిస్తాయి. కలబంద ఉపయోగం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కలబంద వల్ల కలిగే 5 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు..


మలబద్ధకం దూరం..


మలబద్ధకం ఉన్నవారు కలబంద రసాన్ని తాగడం వల్ల ఉపశమనం పొందవచ్చు. అయితే ఈ సమస్య ఉన్న వారు కలబంద జ్యూస్ తాగొచ్చా లేదా అనే విషయాన్ని వైద్యుడ్ని సంప్రదించి సలహా తీసుకోండి. 


పుష్కలంగా విటమిన్ - సి


కలబంద రసం విటమిన్ - సి కి అద్భుతమైన మూలం. విటమిన్ - సి ఆరోగ్యానికి ఎంతో అవసరం. ఎందుకంటే సహజ యాంటీఆక్సిడెంట్లు కారణంగా వాపు వంటి సమస్యలు తలపడతాయి. విటమిన్ - సి వల్ల గుండె జబ్బులు తగ్గడం సహా రోగనిరోధక శక్తి మెరుగువుతుంది. విటమిన్ సి సహజంగా నారింజ, పచ్చి మిరపకాయలు, బ్రోకలీ, ద్రాక్ష, టమోటా రసం వంటి ఆహారాలలో లభిస్తుంది.


కలబంద రసంలో ఎక్కువ శాతం నీరు..


శరీరానికి కావల్సిన నీటిని అందించే కలబంద మంచి ఆరోగ్యానికి ఎంతో అవసరం. అయినప్పటికీ.. ఈ వేసవిలో డీహైడ్రేషన్ పెరిగే అవకాశం ఉన్నందున కలబంద జ్యూస్ తాగడం ప్రయోజనకరంగా ఉంటుంది. అదే సమయంలో కలబంద రసం చక్కెర పానీయాలు, పండ్ల రసాలకు తక్కువ కేలరీల ప్రత్యామ్నాయంగా మారతాయి.


కడుపు సమస్యలకు నివారణ..


కడుపులోని సమస్యల మీద నిర్వహించిన పరిశోధనల ప్రకారం.. కలబంద రసం కడుపులో పుండ్లను తగ్గిస్తుంది. అదనంగా.. కలబందను తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. కలబంద సారంలోని విటమిన్ సి వంటి అనేక యాంటీ ఇన్ఫ్లమేటరీ సమ్మేళనాలు జీర్ణక్రియను మెరుగుపరచడంలో దోహదం చేస్తాయి.


(నోట్: పైన పేర్కొన్న సమాచారమంతా టిప్స్, నివారణ చర్యల నుంచి గ్రహించబడింది. దీన్ని Zee తెలుగు News ధ్రువీకరించడం లేదు.)  


Also Read: Pudina Health Benefits: జీర్ణక్రియ నుంచి రక్త ప్రసరణ వరకూ..పుదీనాతో అద్భుత ప్రయోజనాలు


Also Read: Summer Foods: వేసవిలో ఈ 5 రకాల ఆహారాలను తింటే వేడి నుంచి ఉపశమనం!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook