తులసి ఔషధపరంగా చాలా ప్రాముఖ్యత ఉన్న మొక్క. తులసి ఆకులను ప్రత్యేకించి దేవతార్చనలో వాడుతారు. తులసి ఆకులను తింటే రుగ్మతలు పోయి.. సంపూర్ణ ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. హిందువులకు ప్రత్యేకించి తులసి గురించి చెప్పనక్కరలేదనుకోండీ..!!


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తులసి ఆకుల రసాన్ని ఆయుర్వేదంలోనూ, ఇంటి వైద్యం చిట్కాలలోనూ విస్తృతంగా వాడుతారు. జలుబు, తలనొప్పి, పొట్టకు సంబంధించిన వ్యాధులు, వాపులు, గుండె జబ్బులు, విషాహారాలు, మలేరియా వంటి చాలా రకాల వ్యాధులను నయంచేయడానికి తులసి వాడుతారు.


ఆరోగ్య ప్రయోజనాలు: 


* తులసి ఆకుల్ని పలురకాల జ్వరాల్లో.. ముఖ్యంగా వర్షాకాలంలో మలేరియా, డెంగ్యూ జ్వరం వ్యాప్తి తీవ్రంగా ఉన్నప్పుడు లేత తులసి ఆకుల్ని నీళ్లలో వేసి మరిగించి తాగితే ఈ రకం జ్వరాల నుంచి మంచి ఉపశమనం ఉంటుంది. 


* పలురకాల ఆయుర్వేద దగ్గు మందుల్లో తులసిని కలుపుతారు. తులసి ఆకుల్ని నోట్లో పెట్టుకుని నమలటం వల్ల జలుబు, ఫ్లూ నుంచి ఉపశమనం లభిస్తుంది.


* చక్కెర మోతాదును తగ్గించగలిగే శక్తి తులసికి ఉంది. బీపీని కూడా నియంత్రిస్తుంది. 


* రెండు స్పూనుల తులసి రసాన్ని కొద్దిగా తేనె కలిపి తాగితే పైత్యం తగ్గుతుంది. మూత్ర విసర్జన సమయంలో మంటతో బాధపడేవారు తులసి ఆకులను దంచి, ఆ రసానికి కొద్దిగా పాలు, చక్కెర కలిపి తాగడం వలన ఉపశమనం దొరుకుతుంది.


* తులసి ఆకులను నూరి మొఖానికి రాసుకుంటే మచ్చలు, మరకలు పోయి ముఖం అందంగా కాంతివంతంగా మారుతుంది.


* తులసి, తేనె కలిపి పరగడుపున తీసుకోవడం వల్ల కొన్ని పోషకాలు, విటమిన్లు పుష్కలంగా అందుతాయి. వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది.


తెలుసుకున్నారా ఫ్రెండ్స్..! ఇవి కొన్ని మాత్రమే.. తులసి వల్ల ఇలాంటివి బోలెడు ప్రయోజనాలు ఉన్నాయి.