Amla Health Benefits: ఉసిరి అద్భుతమైన ఔషధ గుణాలకు వేదిక. ఉసిరితో పలు అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టడమే కాకుండా..అధిక బరువు సమస్యను దూరం చేయవచ్చంటున్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆయుర్వేద వైద్యంలో ఉసిరికాయలకు విశేష ప్రాధాన్యత ఉంది. ఉసిరి ఔషధ గుణాల పొదరిల్లు ఇది. అందుకే ఉసిరికాయ జ్యూస్ లేదా ఉసిరి నీరు తాగితే చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. మిమ్మల్ని ఫిట్‌గా ఉంచుతుంది. ఆరోగ్యంగా ఉంచుతుంది. 


ఒక్కమాటలో చెప్పాలంటే ఉసిరికాయను విటమిన్ సికు కేరాఫ్ అడ్రస్‌గా చెప్పవచ్చు. అంత సమృద్ధిగా విటమిన్ సి ఉంటుంది. విటమిన్ సి అనేది చాలా రకాల రోగాల్నించి కాపాడే అద్భుతమైన విటమిన్. అందుకే ఉసిరికాయ జ్యూస్ రోజూ డైట్‌లో చేర్చుకుంటే..అద్భుతమైన ప్రయోజనాలు లభిస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. కడుపు, లివర్‌లను ఆరోగ్యంగా ఉంచడంలో ఉసిరికాయ పాత్ర అమోఘమైంది. ముఖ్యంగా వర్షాకాలంలో ఎదురయ్యే సీజనల్ వ్యాధులు, ఇన్‌ఫెక్షన్ల నుంచి విటమిన్ సి అద్భుత రక్షణ కల్పిస్తుంది.  


ప్రతి రోజూ ఉసిరికాయ తీసుకుంటే రక్తహీనత సమస్య తగ్గుతుంది. ఉసిరిలో పుష్కలంగా ఉన్న పోషక పదార్ధాలు రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తాయి. మెరుగైన ఆరోగ్యాన్ని అందించడంలో ఉసిరికాయలు సూపర్ ఫుడ్‌గా పనిచేస్తాయి. ఉదయం పరగడుపున ఉసిరి జ్యూస్ తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి. ఇమ్యూనిటీ బాగుంటే..ఏ విధమైన రోగాలు చేరవు. 


ఉసిరితో  అధిక బరువుకు చెక్


ఉసిరికాయ క్రమం తప్పకుండా తీసుకుంటే.. ఫిట్ అండ్ స్లిమ్‌గా ఉంటారు. ఉదయం పరగడుపున ఉసిరి జ్యూస్ తీసుకోవాలి. దీనివల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది. మరోవైపు బరువు తగ్గించడంలో ఉసిరి పాత్ర చాలా కీలకం. ఉసిరి జ్యూస్ లేదా ఉసిరి నీళ్లు రోజూ తీసుకుంటే బరువు వేగంగా తగ్గుతారు. ఉసిరి క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మెటబోలిజం వృద్ధి చెందుతుంది. మెటబోలిజం వృద్ధి చెందితే..స్థూలకాయం సమస్య తగ్గుతుంది.


Also read: Almond Milk: బాదంతో థైరాయిడ్ వస్తుందా, బాదం ఎవరెవరు తినకూడదు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook