Amla Health Magic: ఆమ్లా హెల్త్ మ్యాజిక్.. ఉసిరి గురించి తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు..
Amla Health Magic: చలికాలంలో ప్రతిరోజు ఉసిరిని తినడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు దీర్ఘకాలిక వ్యాధులను నుంచి కూడా సులభంగా ఉపశమనం కలిగిస్తాయి. అంతే కాకుండా శరీర బరువును కూడా నియంత్రిస్తాయి.
Amla Health Magic: ఆధునిక జీవనశైలి కాలంలో శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం పెద్ద సవాలుగా మారింది చాలామంది ఆరోగ్యంగా ఉండడానికి అనేక రకాల జాగ్రత్తలు పాటిస్తున్నారు అయినప్పటికీ చిన్నచిన్న వ్యాధులు బారిన పడుతున్నారు అయితే శరీర ఆరోగ్యమనేది ప్రతిరోజు తీసుకునే ఆహారాలపై ఆధారపడి ఉంటుంది మనం ప్రతిరోజు తీసుకునే ఆహారాల్లో శరీరానికి పోషకాలు ఇచ్చే ఆహార పదార్థాలు తీసుకుంటే శరీరం దృఢంగా ఆరోగ్యవంతంగా ఉంటుంది.
ముఖ్యంగా చలికాలంలో శరీరం పై ప్రత్యేక శ్రద్ధ తప్పకుండా చూపాల్సి ఉంటుంది లేకపోతే అనేక రకాల ఇన్ఫెక్షన్ల బారిన పడే అవకాశాలున్నాయి. అయితే శీతాకాలంలో తరచుగా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు ఉదయాన్నే ఒక ఉసిరిని తినడం వల్ల ఫలితాలు పొందుతారు. ఇందులో నీకు కావలసిన అనేక రకాల పోషక గుణాలు లభిస్తాయి కాబట్టి ప్రతిరోజు ఆమ్లాను తినడం వల్ల శరీరానికి పోలేడు లాభాలు కలుగుతాయి.
Also read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం
శీతాకాలంలో ప్రతిరోజు ఉసిరిని తినడం వల్ల కలిగే లాభాలు:
❃ ఉసిరిలో విటమిన్ సి అధిక పరిమాణంలో లభిస్తుంది కాబట్టి చలికాలంలో తరచుగా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు దీనిని తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.
❃ ఉసిరిలో ఉండే ఔషధ గుణాలు జుట్టు సమస్యలను దూరం చేసేందుకు కూడా సహాయపడతాయి. ప్రతిరోజు ఆమ్లాను తినడం వల్ల జుట్టు దృఢంగా ఆరోగ్యంగా ఉంటుంది.
❃ శీతాకాలంలో తరచుగా జీర్ణ సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడే వారికి కూడా ఉసిరి ఎంతగానో సహాయపడుతుంది. ❃ ప్రతిరోజు ఉదయం పూట ఈ కాయను నమిలి తినడం వల్ల అన్ని రకాల పొట్ట సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
❃ ముఖ్యంగా పైల్ సమస్యలతో బాధపడుతున్న వారు చలికాలంలో ఉసిరిని ప్రతిరోజు తీసుకోవడం మంచిది.
❃ గ్లాసు నీటిలో నాలుగు చెంచాల ఉసిరి రసాన్ని కలుపుకొని తాగడం వల్ల ఐసిడిటీ సమస్య నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.
❃ ఉసిరి పొడి, తేనె పంచదార కలిపి చర్మానికి అప్లై చేయడం వల్ల చర్మ సమస్యలు కూడా దూరమవుతాయి.
❃ ప్రతిరోజు ఉసిరి రసం తాగడం వల్ల కంటి చూపు సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.
❃ ఈరోజు ఉదయం పూట ఉసిరిని నమిలి తినడం వల్ల దంతాలు కూడా దృఢంగా ఉంటాయి అంతేకాకుండా నోటి దుర్వాసన నుంచి ఉపశమనం లభిస్తుంది.
❃ అధిక బరువు సమస్యలతో బాధపడుతున్న వారు ఉసిరి రసాన్ని ప్రతిరోజు తాగితే మంచి ఫలితాలు పొందుతారు.
❃ ఉసిరిలో ఉండే గుణాలు రక్తపోటును నియంత్రించేందుకు కూడా సహాయపడతాయి.
Also read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter