Health Remedies: వివిధ రకాల అనారోగ్య సమస్యలు చలికాలంలోనే అధికంగా ఉండటానికి ప్రధాన కారణం ఈ సమయంలో శరిరంలో ఇమ్యూనిటీ వేగంగా తగ్గిపోతుంది. ఎప్పుడైతే రోగ నిరోధక శక్తి లోపిస్తుందో వివిధ రకాల వ్యాధులు సులభంగా దాడి చేస్తుంటాయి. అందుకే ఇమ్యూనిటీని పెంచే ఆహార పదార్దాలు, డ్రింక్స్ క్రమం తప్పకుండా తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తుంటారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇమ్యూనిటీని పెంచే పదార్ధాలు లేదా డ్రింక్స్‌లో‌ మొదటి పేరు ఉసిరి జ్యూస్. చలికాలంలో ఉసిరి జ్యూస్ రోజూ క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఆరోగ్యపరంగా చాలా ప్రయోజనాలున్నాయి. ముఖ్యంగా ఉదయం పరగడుపున తాగితే మంచి ఫలితాలుంటాయి. ఇందులో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, ఇతర పోషకాలు అద్భుతంగా ఉంటాయి. ఉసిరి అంటేనే విటమిన్ సి కేరాఫ్ అని చెప్పవచ్చు. విటమిన్ సి కారణంగా రోగ నిరోధక శక్తి అద్భుతంగా బలపడుతుంది. అందుకే రోజూ పరగడుపున తాగాల్సి ఉంటుంది. 


ఉసిరిలో పెద్దమొత్తంలో ఉండే ఫైబర్ కారణంగా జీర్ణక్రియ మెరుగుపడి మలబద్ధకం సమస్య దూరమౌతుంది. కడుపులో గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు తగ్గుతాయి. మలబద్ధకం సమస్యను అద్భుతంగా నివారిస్తుంది. ఉసిరి జ్యూస్ మెటబోలిజంను వేగవంతం చేయడం వల్ల శరీర ప్రక్రియ బాగుంటుంది. శరీరంలో వివిధ భాగాల్లో పేరుకుపోయుండే కొవ్వును కరిగిస్తుంది. ఆకలి నియంత్రించడంతో బరువు తగ్గించే ప్రక్రియలో దోహదం చేస్తుంది. ఉసిరిలో ఉండే ఐరన్ కారణంగా రక్తంలో హిమోగ్లోబిన్ పెరుగుతుంది. రక్త ప్రసరణ పెరుగుతుంది. అంతేకాకుండా రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది. అందుకే రోజూ క్రమం తప్పకుండా ఉసిరి జ్యూస్ తాగడం వల్ల డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది. ఉసిరి జ్యూస్ క్రమం తప్పకుండా తాగడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయి. ఫలితంగా గుండె వ్యాధుల ముప్పుు తగ్గుతుంది. 


ఇక ఉసిరి చర్మ, కేశ సంరక్షణలో అనాదిగా ఉపయోగిస్తున్నారు. ఇందులో పెద్దమొత్తంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ల కారణంగా హెయిర్ కేర్, స్కిన్ కేర్‌కు ఉపయోగపడుతుంది. ముఖంపై ముడతలు, మొటిమల సమస్య దూరమౌతుంది. హెయిర్ ఫాల్ సమస్యకు ఉసిరి అద్భుతంగా పనిచేస్తుంది. 


Also read: Ys Jagan on Allu Arjun Arrest: అల్లు అర్జున్‌పై అక్రమ కేసులు, అరెస్టు అక్రమం అంటూ వైఎస్ జగన్ ట్వీట్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.