Amla Juice Benefits: ఉసిరికాయ శరీరానికి చాలా రకాల ప్రయోజనాలను చేకూర్చుతుంది. అంతేకాకుండా దీని రసం కూడా అనారోగ్య సమస్యల నుంచి విముక్తి కలిగిస్తుంది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసాన్ని తాగితే ఆరోగ్యానికి చాలా మంచిదని ఆయుర్వేద శాస్త్రంలో పేర్కొంది. అంతే కాకుండా  రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఉసిరి రసం తాగిన తర్వాత జామకాయ రసం తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని నిపుణులు పేర్కొన్నారు. ఉసిరిని రసాన్నితాగడం వల్ల రక్తహీనతను దూరమవడమే కాకుండా..రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. అందుకు ఉసిరిని సూపర్ ఫుడ్ అని కూడా అంటారు. ఈ రసాన్ని ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఉసిరికాయలో ఈ లక్షణాలు ఉన్నాయి:


ఉసిరికాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అంతే కాకుండా విటమిన్ ఎ, బి కాంప్లెక్స్, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, కార్బోహైడ్రేట్, యాంటీ ఆక్సిడెంట్లు, పీచు వంటి గుణాలు ఉసిరిలో ఉన్నాయి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఉసిరి రసం తాగడం వల్ల రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి దోహదపడుతుందని నిపుణులు చెబుతున్నారు. శరీరాన్ని అనేక ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తుంది.


రోగనిరోధక శక్తి ని పెంచుతుంది:


ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా కరోనా ఇన్ఫెక్షన్ నుంచి రక్షించడానికి, రోగనిరోధక శక్తి పెంచేందుకు దోహదపడుతుంది. శరీరంలో బలమైన రోగనిరోధక శక్తి అనేక వ్యాధుల బారిన పడకుండా శరీరాన్ని రక్షించడంలో సహాయపడుతుంది. అయితే ఈ రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి ఉసిరి రసం తాగొచ్చని నిపుణులు తెలుపుతున్నారు.


బరువు కూడా అదుపులో ఉంచుతుంది:


ప్రస్తుతం చాలా మంది ఫిట్ గా, స్లిమ్ గా ఉండేందుకు చాలా రకాల వ్యాయామాలు చేస్తూ ఉంటారు.  అయితే ఎలాంటి వ్యాయామం లేకుండా ఫిట్‌గా ఉండడానికి ఉదయాన్నే ఖాళీ కడుపుతో జామకాయ రసాన్ని తాగాలని నిపుణులు తెలుపుతున్నారు. ఇది బరువును కూడా తగ్గించి.. బరువును అదుపులో ఉంచుతుంది.


(NOTE: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)


 


Also Read: Home Remedies For Health: కడుపులో సమస్యలతో బాధపడుతున్నారా..అయితే ఇవి ట్రై చేయండి ఉపశమనం పొందుతారు..!!


Also Read: Benefits of Moringa Leaves: మునగ ఆకు వల్ల శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నయో తెలుసా..?


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook