సరైన డైట్ ఉంటేనే ఆరోగ్యం ఉంటుంది. చెడు ఆహారపు అలవాట్లు మనిషి ఆరోగ్యాన్ని పాడుచేస్తాయి. కొన్ని రకాల ఆహార పదార్ధాలైతే..మీ లివర్, కిడ్నీలకు ప్రమాదకరంగా మారతాయి. వీటిలో ఉంటే అమ్మోనియా ఇందుకు కారణమౌతుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మనం తీసుకునే చాలా ఆహార పదార్ధాల్లో అమ్మోనియా ఉంటుందని చాలామందికి తెలియదు. ఆహార పదార్ధాల్ని శుభ్రం చేసే ప్రక్రియలో భాగంగా అమ్మోనియో వినియోగిస్తుంటారు. ప్రోసెస్డ్ మీట్, ఫిష్ , ప్రాన్స్‌లో అమ్మోనియా ఎక్కువగా ఉంటుంది. అమ్మోనియా మోతాదు మించితే ఆరోగ్యాన్ని పాడుచేస్తుంది. అమ్మోనియో మోతాదు పరిమితంగా ఉంటే కిడ్నీ, లివర్‌లు వాటిని తొలగించేస్తాయి. కానీ పరిమితి దాటితే మాత్రం ఆ అమ్మోనియానే కిడ్నీ, లివర్‌లను డ్యామేజ్ చేస్తుంది. ఫలితంగా జలుబు, దగ్గు సమస్యలు ఎదురౌతాయి. చర్మంపై ర్యాషెస్ ఏర్పడతాయి. అమ్మోనియా అధికమైతే..శ్వాస పీల్చడంలో ఇబ్బంది ఎదురౌతుంది. 


ఉల్లిపాయలు


వివిధ రకాల ఆహార పదార్ధాల్లో ఉల్లిపాయల్ని విరివిగా ఉపయోగిస్తుంటారు. 100 గ్రాముల ఉల్లిపాయల్లో 0.027 గ్రాముల అమ్మోనియా ఉంటుంది. వాస్తవానికి ఇది చాలా తక్కువ. ఉల్లిపాయల్ని విరివిగా వాడటం వల్ల ఆరోగ్యానికి తీవ్రనష్టం కలుగుతుంది.


పొటాటో చిప్స్


ఇందులో అమ్మోనియా అధికంగా ఉంటుంది. ప్యాకెట్ పదార్ధాల్లో అమ్మోనియో మరింత ఎక్కువగా ఉంటుంది. 100 గ్రాముల పొటాటో చిప్స్‌లో అమ్మోనియో స్థాయి 0.024 గ్రాములుంటుంది. చిప్స్ ఎక్కువగా తింటే అమ్మోనియా స్థాయి పెరిగిపోతుంది. 


ప్రోసెస్డ్ మీట్


ప్రోసెస్డ్ మాంసంలో అమ్మోనియో చాలా అధికంగా ఉంటుంది. ఇందులో అమ్మోనియా స్థాయి చాలా ఎక్కువ. పిజ్జా, శాండ్విచ్, పాస్తా వంటి పదార్ధాల్లో ప్రోసెస్డ్ మీట్ ఎక్కువ. సాధ్యమైనంతవరకూ తక్కువ మోతాదులో తీసుకోవాలి.


పీనట్స్ బటర్


దాదాపు 100 గ్రాముల పీనట్ బటర్‌లో అమ్మోనియో స్థాయి 0.049 గ్రాములుంటుంది. ఇందులో అమ్మోనియా ఉంటుంది. ఇది శరీరానికి హాని చేకూరుస్తుంది. 


బటర్


ఇందులో పెద్దమొత్తంలో అమ్మోనియా ఉంటుంది. ఇది శాండ్విచ్, బర్గర్, పిజ్జా, ప్రోసెస్డ్ ఆహారంలో చాలా విరివిగా ఉపయోగిస్తారు. అమ్మోనియా అన్నింటికంటే ఎక్కువగా శాచ్యురేటెడ్ బ్లూ చీజ్‌లో ఉంటుంది. 


Also read: Apple Tea For Weight Loss: యాపిల్‌ టీతో బరువు తగ్గడమేకాకుండా.. మలబద్ధకం, అసిడిటీ, గ్యాస్ సమస్యలకు చెక్‌..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook