సాధారణంగా వయస్సు పెరిగే కొద్దీ చర్మంలో మార్పు రావడం సహజం. ఎవరూ దీన్ని కాదనలేదు. అయితే వయస్సుకు ముందే వృద్ధాప్యఛాయలు కన్పిస్తే కచ్చితంగా ఆందోళన కల్గిస్తుంది. సకాలంలో ఈ సమస్యను పరిష్కరించకపోతే..ముఖంపై ముడతలు అలానే ఉండిపోతాయి. ఈ సమస్య నుంచి విముక్తి పొందేందుకు 5 సులభమైన యాంటీ ఏజీయింగ్ టిప్స్ గురించి తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ముఖంపై ముడతల్ని ఎలా నియంత్రించాలి


ఆరోగ్యకర డైట్ అవసరం


వైద్య నిపుణుల ప్రకారం ఒకవేళ మీకు నిర్ణీత వయస్సు కంటే ముందే వృద్ధాప్య ఛాయలు కన్పిస్తే వెంటనే అప్రమత్తం కావాలి, ఆరోగ్యకరమైన బ్యాలెన్స్‌డ్ డైట్ తీసుకోవాలి. దీనికోసం సీజనల్ ఫ్రూట్స్, కూరగాయలు, సలాడ్ వంటివి తప్పకుండా తినాలి. దాంతోపాటు స్వీట్స్ లేదా హాట్ పదార్ధాలకు దూరంగా ఉండాలి. 


చర్మాన్ని ఎండ నుంచి మట్టి ధూళి నుంచి రక్షణ


మీరు ఫిట్‌గా ఉండేందుకు ముఖాన్ని ఎండ తీవ్రత, దుమ్ము ధూళి నుంచి కాపాడుకోవల్సిన అవసరముంది. లేకపోతే మీ ముఖం ఎండకు మాడిపోతుంటుంది. దాంతోపాటు ఇందులో ముడతలు పడటం ప్రారంభం కావచ్చు. బయటకు వెళ్లినప్పుడు బట్టలు లేదా మాస్క్ ముఖానికి తప్పకుండా కవర్ చేయాలి


రోజుకు కనీసం 2 సార్లు ముఖం శుభ్రం చేసుకోవాలి


ముఖంపై నిగారింపును స్థిరంగా ఉంచాలంటే మీరు రోజుకు కనీసం 2 సార్లు శుభ్రమైన నీళ్లతో కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల ముఖంపై పేరుకున్న దుమ్ము ధూళి శుభ్రమౌతాయి. దాంతోపాటు చర్మంలో చొచ్చుకునే విష పదార్ధాలు బయటకు వచ్చేస్తాయి. ముఖం కడగడం వల్ల అందులో తేమ ఉంటుంది.


మత్తు పదార్ధాలకు దూరం


మత్తు పదార్ధాలను సేవించడం వల్ల సమయానికి ముందే వృద్ధాప్యం వస్తుంది. వృద్ధాప్య లక్షణాల్ని నివారించేందుకు స్మోకింగ్, డ్రింకింగ్ వెంటనే వదిలేయాలి. ఇలాంటి మత్తు పదార్ధాల వల్ల చర్మం డీహైడ్రేట్ అవుతుంది. దాంతో నిర్ణీయ వయస్సుకు ముందే చర్మానికి హాని కలుగుతుంది.


రోజుకు 20 నిమిషాలు వాకింగ్


నిర్ణీత వయస్సు కంటే ముందే వృద్ధాప్య ఛాయలు రాకుండా ఉండాలంటే..రోజూ కనీసం 20 నిమిషాలు జాగింగ్ లేదా స్పీడ్ వాకింగ్ చేయాలి. ఇలా చేయడం వల్ల శరీరంలో రక్త సరఫరా మెరుగవుతుంది. ఫలితంగా ముఖంపై మృదుత్వం వస్తుంది. వృద్ధాప్య ఛాయలు దూరమౌతాయి. వ్యాయామం చర్మ సంరక్షణకు చాలా మంచిది.


Also read: Uric Acid: మీ బాడీలో యూరిక్ యాసిడ్ పెరిగిపోతుందా..నొప్పులు తీవ్రమైతే ఈ ఫ్రూట్స్ తీసుకుంటే చాలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook