Hydration Drinks In Summer: వేసవిలో అలసిపోతున్నారా? ఈ సూపర్ డ్రింక్స్ మీకోసమే..!
Super Hydration Drinks In Summer: వేసవిలో చాలా మంది శరీర ఉష్ణోగ్రతను తగ్గించుకోవడం కోసం అనేక రకాల డ్రింక్స్‌ను తీసుకుంటారు. అయితే సమ్మర్‌లో కలిగే డీహైడ్రేషన్ సమస్య నుంచి ఉపశమనం పొందాలి అంటే ఈ అద్భుతమైన డ్రింక్స్‌ను తీసుకోవాల్సి ఉంటుంది.
Super Hydration Drinks In Summer: వేసవికాలంలో శరీరం డీహైడ్రేషన్ బారిన పడుతుంది. దీని కారణంగా అలసట, నీరసం వంటి సమస్యలు కలుగుతాయి. వేసవిలో అధిక శాతం నీరు తీసుకోవడం చాలా అవసరం. లేకుంటే వడదెబ్బ తగ్గలడం ఎంతో సులభం. అయితే ఎలాంటి పదార్థలతో మన శరీరాని హైడ్రేట్‌గా ఉంచుకోవాలి అనేది మనం తెలుసుకుందాం.
సమ్మర్‌లో శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచే సూపర్ జ్యూసులు ఇవే వీటిని తీసుకుంటే ఎన్నో లాభాలు పొందవచ్చు. అందులో కొబ్బరి నీరు వేసవిలో ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎన్నో లాభాలు కలుగుతుంది. వేసవిలో కలిగే విరేచనానికి , జర్వం వంటి సమస్యలకు తగ్గిస్తుంది. శరీరం కోల్పోయిన నీటిని తిరిగి భర్తి చేయడంలో సహాయపడుతుంది. కొబ్బరి నీటిలో డీహైడ్రేషన్ ను నిరోధించే ఎలక్ట్రోలైట్లు పుష్కలంగా దొరుకుతాయి. నిమ్మకాయ కూడా వేసవిలో ఎంతో ప్రభావింతంగా పని చేస్తుంది. ఇది మూడ్ రిఫ్రెష్ చేయడంలో ఎంతో మేలు చేస్తుంది. ఇందులో విటమిన్-సి, యాంటీ ఆక్సిడెంట్ ఉండటం వల్ల శరీరం డీహైడ్రేషన్ సమస్య బారిన పడకుండా ఉంటుంది. రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా మేలు చేస్తుంది. బరువు తగ్గడంలో కూడా మేలు చేస్తుంది.
దోసకాయ, స్ట్రాబెర్రీ, పుదీనా, అల్లం, నారింజ వంటి కూరగాయలు, పండ్లు, ఆకులు జ్యూస్ లను వేసవిలో తీసుకోవడం వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయి. ఇవి తీసుకోవడం వల్ల శరీరంలో ఉండే టాక్సిన్లను బయటకు పంపడంలో సహాయపడుతుంది. దానిమ్మ పండు జ్యూస్ తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్‌తో పాటు గుండె, మెదడు, ప్రోస్టేట్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. సమ్మర్‌లో వచ్చే చెమట వల్ల శరీరం కోల్పోయిన నీటిని తిరిగి పొందేలా చేస్తుంది. ఐరన్ ను కూడా అందిస్తుంది.
గ్రీన్ టీ తీసుకోవడం వల్ల కూడా ఎన్నో లాభాలు కలుగుతాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్‌లు పుష్కలంగా ఉంటుంది. బరువు తగ్గించడంలో , డిటాక్స్ ను తొలగించడంలో ఎంతో మేలు చేస్తుంది.
వీటితో పాటు రాగి జావా, సబ్జా నీళ్లు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. కూల్ డ్రింక్స్, షుగర్ ఎక్కువగా ఉండే పదార్థాలకు దూరంగా ఉండండి. వీటిని తీసుకోవడం వల్ల అజీర్ణం, జీర్ణవ్యవస్థ దెబ్బతినడం వంటి సమస్యలు కలుగుతాయి. అయితే మీరు ఈ పైన చెప్పిన పదార్థాలు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు. అలాగే పోషకరమైన ఆహారపదార్థాలను తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ఉంటుంది.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి