Arthritis Precautions: ఆర్థరైటిస్ అనేది అత్యంత ప్రమాదకరమైంది. జాయింట్స్ నొప్పి, స్వెల్లింగ్ తీవ్రంగా ఉంటుంది. ఒక్కొక్కరిలో ఒక్కో రీతీన లక్షణాలుంటాయి. రోజూ తీసుకునే డైట్ మార్చితే ఈ సమస్యల్నించి ఉపశమనం పొందవచ్చు. దీనికోసం 5 రకాల పదార్ధాలను వైద్యులు సూచిస్తున్నారు. ఈ ఐదింటినీ డైట్ కు దూరం చేయాల్సిందే.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆర్ధరైటిస్ సమస్య ఎంత తీవ్రంగా కన్పిస్తుందో అంత సులభంగా నియంత్రించవచ్చు. ఎందుకంటే ఆహారపు అలవాట్లు మార్చుకోవడం, రోజూ తగిన వ్యాయామం చేయడం ఇదంతా మీ చేతుల్లో ఉన్నదే. కొన్ని రకాల ఆహార పదార్ధాలను తినకూడదు. అందులో ముఖ్యమైంది షిమ్లా మిర్చి. ఇందులో ఉండే సోలానీన్ అనే పదార్ధం ఆర్ధరైటిస్ రోగులకు హాని కల్గిస్తుంది. అందుకే షిమ్లా మిర్చి వాడకం పూర్తిగా తగ్గించడం లేదా మానేయడం చేయాలి


ఇక మరో పదార్ధం ప్రతి ఒక్కరూ సర్వ సాధారణంగా, ఎక్కువగా తినే బంగాళ దుంప. అందరికీ ఇష్టమైందే అయినా దూరం పెట్టక తప్పదు. ఇందులో ఉండే స్టార్చ్ స్వెల్లింగ్ పెంచుతుంది. అంతేకాకుండా గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా ఎక్కువ కావడంతో బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. ఇక కాలిఫ్లవర్ కూడా ఆర్థరైటిస్ రోగులకు మంచిది కాదు. ఇందులో ఉండే ఆక్సాలిక్ యాసిడ్ శరీరంలో స్వెల్లింగ్ పెంచుతుంది. ఆర్ధరైటిస్ రోగులకు మంచిది కాదు.


వంకాయలో కూడా సోలానీన్ అనే పదార్ధం ఉంటుంది. ఇది ఆర్ధరైటిస్ రోగుల్లో స్వెల్లింగ్ పెంచుతుంది. దాంతో నొప్పి మరింత తీవ్రమౌతుంది. అందుకే ఆర్ధరైటిస్ కేసుల్లో వంకాయను దూరంగా పెట్టాలి. మిర్చి కూడా ఆర్ధరైటిస్ రోగులకు మంచిది కాదు. ఇందులో ఉండే క్యాప్సైసిన్ కారణంగా కడుపులో మంట, స్వెల్లింగ్ సమస్య పెరుగుతుంది. ఆర్దరైటిస్ రోగుల్లో సహజంగానే ఉండే నొప్పిని ఇది మరింత పెంచుతుంది. 


Also read: Diabetes Plants: ఇంట్లో కుండీల్లో పెంచుకునే ఈ 3 మొక్కలతో ఇన్సులిన్ రోగులకు సైతం ఉపశమనం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook