Ashoka Tree for Diabetes: అశోక చెట్టు బెరడులో డయాబెటిస్ మటుమాయం..!
Ashoka Tree for Diabetes: డయాబెటిస్ ప్రాణాంతకరమైన వ్యాధి. రక్తంలో షుగర్ స్థాయి పెరగడం వల్ల ఈ వ్యాధి వస్తుంది. ఇది శరీరానికి చాలా నష్టాన్ని కలిగిస్తుంది. జీవనశైలిలో మార్పుల వల్ల ప్రస్తుతం చాలా మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు.
Ashoka Tree for Diabetes: డయాబెటిస్ ప్రాణాంతకరమైన వ్యాధి. రక్తంలో షుగర్ స్థాయి పెరగడం వల్ల ఈ వ్యాధి వస్తుంది. ఇది శరీరానికి చాలా నష్టాన్ని కలిగిస్తుంది. జీవనశైలిలో మార్పుల వల్ల ప్రస్తుతం చాలా మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. చెడు ఆహారపు అలవాట్ల వల్ల డయాబెటిస్ తీవ్రత పెరుగుతుందని వైద్యులు తెలిపారు. అయితే దీనిపై ప్రత్యేక శ్రద్ధ వహిండం వల్ల త్వరగానే విముక్తి పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇంట్లో ఉండే ఆహారంతోనే షుగర్‌ను నియంత్రించవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. అశోకుని బెరడు డయాబెటిస్‌ను నుంచి విముక్తి కలిగిస్తుందని నిపుణులు అంటున్నారు. అందులో ఎన్నో రకాల వైద్యగుణాలున్నాయని తెలుపుతున్నారు. అయితే అశోకుని చెట్టు బెరడును షుగర్ వ్యాధి గ్రస్తులు ఎలా ఉపయోగించవచ్చో తెలుసుకుందాం.
అశోక చెట్టు బెరడులో మేలు:
అశోక చెట్టు యొక్క బెరడు యాంటీ డయాబెటిక్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది రక్తంలోని ఇన్సులిన్ చర్యను పెంచడం ద్వారా శరీరంలోని చక్కెర పరిమాణాన్ని తగ్గిస్తుంది. అయితే దీనిని డాక్టర్ సలహాతో మాత్రమే ఉపయోగించాలి. అశోకుడి చెట్టు బెరడును పౌడర్‌గా తయారు చేసుకోని.. రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని నీటితో తీసుకోవడం ద్వారా ఖచ్చితంగా ప్రయోజనం పొందుతారని నిపుణులు చెబుతున్నారు.
బెరడుతోనే కాకుండా పుష్పాలతోనూ కూడా డయాబెటిస్ నియంత్రించవచ్చు. పూలను రోజూ తినడం వల్ల ఖచ్చితంగా ప్రయోజనం పొందడమే కాకుండా.. ఇలా నిత్యం చేయడం వల్ల బ్లడ్‌లోని షుగర్ స్థాయి కూడా అదుపులోకి వస్తుంది. షుగర్ అదుపులోకి వచ్చేందుకు చాలా మంది వేప చెట్టు బెరడును ఉపయోగిస్తారు. అయితే అశోక చెట్టు బెరడుతో పాటు వేప బెరడును కూడా ఉపయోగించవచ్చు. ఈ రెండింటినీ పొడిగా తయారు చేసి వాడవచ్చని నిపుణులు తెలిపారు. ఇలా చేయడం వల్ల సమస్య నుంచి ఖచ్చితంగా విముక్తి పొందవచ్చు.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Health Tips: వారు టమోటాలను అస్సలే తినకూడదు..తింటే ప్రమాదమే..!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook