Asthma and Diet Tips: What to Eat and What to Avoid: దీర్ఘకాలిక వ్యాధుల్లో ఆస్తమా కూడా ఒకటి. దీన్నే ఉబ్బసం అంటారు. మనం లంగ్స్‌కి ప్రాణవాయువును చేరవేసే శ్వాస నాళాల్లో వాపు రావడం కారణంగా ఆస్తమా వస్తుంది. అంతేకాదు.. శ్లేష్మం ఉత్పత్తి అవ్వడం వల్ల తీవ్రంగా ఇబ్బందిపడతారు. అయితే ఈ సమస్య నుంచి ఉపశమనం పొందడానికి ఆహార నియమాల్లోనూ కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మేలు. ఆస్తమాతో (Asthma) బాధపడే వారు కొన్ని ఆహారాలు తీసుకోవాలి.. అలాగే కొన్నింటికి దూరంగా ఉంటే మంచిది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆస్తమాతో బాధపడే వారు ఇలాంటి ఆహారాలు తీసుకోకపోవడమే మంచిది. ఆస్తమాతో బాధపడేవారు శరీరంలో గ్యాస్‌ ని (Gas‌) ఉత్పత్తి చేసే ఆహారపదార్థాలు తీసుకోకపోవడం మంచిది. క్యాబేజీ, వెల్లుల్లి, ఉల్లిపాయలు, మసాలాలు, కార్బోనేటెడ్‌ డ్రింక్స్ (Carbonated‌ Drinks) వంటివి తీసుకోకపోవడం ఉత్తమం.


Also Read : Gold Smuggling Hyderabad: గోల్డ్ స్మగ్లింగ్ కేసులో హైదరాబాదీ నగల వ్యాపారి అరెస్ట్


ఇక ప్రాసెస్‌ చేసిన పదార్థాలు.. ప్యాకింగ్‌ చేసిన ఫుడ్స్‌కు దూరంగా ఉంటే చాలా మంచిది. ఎందుకంటే ఈ పదార్థాలను ఎక్కువ రోజులు నిల్వ ఉంచేందుకు సల్ఫైట్‌ (Sulfite‌) లాంటి రసాయనాలను ఉపయోగిస్తారు. దీంతో శ్వాస సంబంధిత సమస్యలు ఎక్కువయ్యే అవకాశం ఉంది. అలాగే కొవ్వు ఎక్కువగా ఉండే పదార్థాల వల్ల కూడా ఆస్తమా పెరిగే అవకాశం ఉంది. అలాగే మసాలాలు, టీ, కాఫీల్లో ఉండే సెలిసిలేట్స్ వంటివి ఆస్తమా రోగులకు హానికరం. వీటిని తీసుకోకపోవడం మంచిది. ఇక ఎక్కువగా తింటే కూడా బాడీలో గ్యాస్‌ ఎక్కువగా ఫామ్ అయ్యే అవకాశం ఉంది. అందువల్ల ఆహారం తక్కువగా తీసుకుంటే మంచిది. 


Also Read :vehicle Number Plate: ఢిల్లీ యువతి స్కూటీ నంబర్ ప్లేట్‌పై 'SEX'-ఎందుకిలా..?


కొన్ని ఆహారపదార్థాలను రెగ్యులర్‌‌గా తీసుకోవడం ఆస్తమా రోగులకు మంచిది. చిలగడదుంపలు, క్యారట్స్‌, (Carrots‌) ఆకుకూరలులాంటి పదార్థాలు తరుచుగా తీసుకోవడం మంచిది. వీటిలో ఉండే విటమిన్‌ ఎ, బీటా కెరోటిన్‌ శ్వాస సంబంధిత సమస్యల నుంచి రిలీఫ్ కలిగిస్తుంది. అలాగే విటమిన్‌ - డి ఎక్కువగా ఉండే ఫుడ్స్ కూడా ఎక్కువగా తీసుకుంటే మంచిది. పాలు, చేపలు, గుడ్లులాంటివి తీసుకోవచ్చు.


అరటిపండ్లు (Bananas) ఎక్కువగా తీసుకోవడం కూడా ఆస్తమా బాధితులకు ఉపయోగకరంగా ఉంటుంది. పొటాషియం (Potassium), యాంటీ ఆక్సిడెంట్లు వీటిలో అధికంగా ఉంటాయి కాబట్టి శ్వాస సంబంధిత వ్యాధులతో ఇబ్బందులుపడే వారికి ఇవి ఎంతో మేలు చేస్తాయి.యాపిల్‌ కూడా ఎంతో మేలు చేస్తోంది. ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని ఇది మరింత బలోపేతం చేస్తుంది. అలాగే గుమ్మడి గింజలు, డార్క్‌ చాక్లెట్‌, చేపలలో మెగ్నీషియం (Magnesium) ఎక్కువగా ఉంటుంది. ఇది ఆస్తమా రోగులకు ఎంతో ఉపశమనం కలిగిస్తుంది. 


Also Read : Sirivennela Sitaramasastri: ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల ఇకలేరు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook