White Hair Problem: ఆధునిక జీవనశైలిలో మారిన ఆహార అలవాట్ల కారణంగా చాలా మంది వివిధ సమస్యలతో బాధపడుతున్నారు. అందులో తెల్ల జుట్టు సమస్య బారిన పడుతున్నారు. మరి చిన్నవయసు వారు కూడా తెల్లజట్టు సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. దీనికి కారణం పోషక ఆహార లోపం అని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే ఈ తెల్ల జుట్టు రాలకుండా ఉంటడం కోసం చాలా మంది ఎక్కువగా ఖర్చు పెడుతుంటారు. హాని కరమైన ప్రొడెట్స్‌ను ఉపయోగిస్తుంటారు. దీని వల్ల జుట్టు సమస్యలు తలెత్తుతాయి. అయితే ఎలాంటి ప్రొడెట్స్‌ ఉపయోగించకుండా ఇంట్లోనే లభించే కొన్ని పదార్థాలతో జుట్టు తెల్లగా మారకుండా చేసుకోవచ్చు.  ఆయుర్వేద నిపుణులు ఈ హోం రెమెడీని ఉపయోగించడం వల్ల మీరు తెల్ల జుట్టు సమస్యలతో మళ్లీ ఇబ్బందులు పడకుండా ఉంటారని చెబుతున్నారు. 


హోం రెమెడీకి కావాల్సిన పదార్థాలు: 


జామా ఆకు  50 గ్రాముల , గోరింటాకు పొడి  50 గ్రాముల ,  నిమ్మరసం  60 మి.లీ 


తయారు చేసుకోవాల్సిన విధానం: 


ముందుగా జామా ఆకులను పేస్ట్‌గా తయారు చేసుకోవాలి. ఆ తర్వాత గోరింటాకు పొడి కలుపుకోవాలి. ఇందులోకి నిమ్మరసం వేసి బాగా కలిపి ఒక ఇనుప పాత్రలో ఏడెనిమిది రోజుల పాటు ఉంచుకోవాలి. ఈ పేస్ట్ పూర్తిగా నల్లగా మారుతుంది. దీని సహజంగా తయారు చేసి పేస్ట్‌ కాబట్టి ఎలాంటి సమస్యల బారిన పడాల్సి అవసరం ఉండదు.  మీరు తెల్ల జుట్టు సమస్య నుంచి బయట పడవచ్చు. 


Black Salt Benefits: బ్లాక్‌ సాల్ట్‌తో ఎసిడిటీ, మధుమేహానికి చెక్‌..ఇలా వినియోగించండి!


దీని ఎలా ఉపయోగించాలి అంటే ముందుగా ఈ పేస్ట్‌ను మీ తలపై వెంట్రుకల మొదళ్ళ నుంచి కొన వరకు అప్లై చేసుకోవాలి. కొంత సమయం తర్వాత తల స్నానం చేయడానికి కుంకుడుకాయని ఉపయోగించాలి . ఇలా చేయడం వల్ల తల వెంట్రుకలు నల్లగా మారుతాయి. అంతేకాకుండా మీ జుట్టు శాశ్వతంగా నల్లబడుతుందని ఆయుర్వద నిపుణులు చెబుతున్నారు. 


ఈ చిట్కాతో పాటు కొన్ని ఆహార పదార్థాలు  తీసుకోవడం వల్ల తెల్లజుట్టుతో బాధపడాల్సి అవసరం లేదని ఆరోగ్య, ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. మీ ఆహారంలో సలాడ్లు, మాంసం, పండ్లు, ఆకు కూరలు తీసుకోవడం వల్ల తెల్ల జుట్టు సమస్య బారిన పడాల్సి అవసరం లేదు. తెల్ల జుట్టకు ఉల్లిపాయ ఎఫెక్టివ్‌గా పనిచేస్తుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.దీంతో పాటు ఉసిరి పొడిని హెయిర్ డైలా చేసి వారానికోసారి వాడితే  ఉపశమనం  పొందవచ్చని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.


Also Read Cloves: అధిక రక్తపోటు సమస్యకు ఇలా చెక్‌ పెట్టిండి!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter