Ayurvedic Tips For Diabetes In 5 Days: డయాబెటిస్ సమస్యతో బాధపడేవారు.. ఎప్పుడూ బాధపడుతూనే ఉంటారు. కానీ వీరు అస్సలు చింతించ కూడదని నిపుణులు అంటున్నారు. అయితే ఈ సమస్య నుంచి ఉపశమనం పొందడానికి ఆయుర్వేదం శాస్త్రంలో పేర్కొన్న పలు రకాల చిట్కాలు వినియోగిస్తే మధుమేహం నియంత్రణలో ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇవి శరీరంలోని రక్తలో చక్కెర స్థాయిలను ప్రభావితం చేస్తాయని.. తద్వార చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటుంది. తీవ్ర మధుమేహం సమస్యలతో బాధపడుతున్న వారికి ఇది ప్రభావవంతంగా పని చేస్తుందని నిపుణులు తెలుపుతున్నారు. డయాబెటిస్ పేషెంట్ ఇలాంటి సమస్యలతో బాధపడుతుంటే తప్పకుండా ఈ చిట్కాలను పాటించాలి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మధుమేహాన్ని సులభంగా ఇవి నియంత్రిస్తాయి:


నేరేడు గింజలు:
డయాబెటిక్ రోగులకు నేరేడు పండు గింజలు చాలా మేలు చేస్తాయి. ఇందులో ఉండే గుణాలు షుగర్ నియంత్రించడానికి సహాయపడతాయి. దీని కోసం.. గింజలను ఎండబెట్టి వాటిని పొడి చేయండి. రోజూ ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటితో వేసుకుని తాగాలి.


ఉసిరి:
చక్కెరను నియంత్రించడానికి ఉసిరి చాలా సహాయపడుతుంది. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. కావున మధుమేహ రోగులకు చాలా మేలు చేస్తుందని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. ఉసిరికాయలో హైపోగ్లైసీమిక్ లక్షణాలను అధిక పరిమాణంలో ఉంటాయి. వీటిని క్రమం తప్పకుండా తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణలో ఉంటాయి.  అంతేకాకుండా  గింజలను పొడి చేసి.. కూడా తీసుకోవచ్చు. అయితే తీవ్ర మధుమేహాన్ని సులభంగా నియంత్రించేందుకు ఇది ప్రధాన పాత్ర పోషిస్తుంది.


మేడి పండు ఆకులు:
మధుమేహం రోగులకు రక్తంలో చక్కెర పరిమాణాలు నియంత్రించడానికి మేడి పండు ఆకులు సహాయపడతాయి. ఇందులో  యాంటీ డయాబెటిక్ లక్షణాలు ఉన్నాయి. బాడీలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి ప్రధాన పాత్ర పోషిస్తాయి. తీవ్ర మధుమేహంతో బాధపడుతుంటే.. ఉదయం పూట ఈ ఆకులను నమలండి. లేకుంటే.. నీటిలో వేసి మరిగించి కూడా తాగవచ్చు. ఇలా క్రమం తప్పకుండా తాగితే మధుమేహానికి చెక్ పెట్టొచ్చు.


(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)


Also Read: Jabardasth Praveen : జబర్ధస్త్ ప్రవీణ్ ఇంట్లో విషాదం.. కోలుకోలేని దుఖంలో ప్రవీణ్


Also Read: Nassar: సినీ నటుడు నాజర్‌కు గాయాలు..ఆస్పత్రికి తరలింపు..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి