Ayurvedic Remedies For Diabetes: నేటి త‌రుణంలో మ‌న‌లో చాలా మందిని వేధిస్తున్న దీర్ఘ‌కాలిక అనారోగ్య స‌మ‌స్య‌ల్లో షుగ‌ర్ వ్యాధి ఒక‌టి. వయ‌సుతో సంబంధం లేకుండా అంద‌రూ ఈ స‌మ‌స్య బారిన ప‌డుతున్నారు. షుగ‌ర్ వ్యాధి కార‌ణంగా త‌లెత్తే స‌మ‌స్య‌లు అంతా ఇంతా కాదు. మారిన మ‌న ఆహార‌పు అల‌వాట్లే ఈ స‌మ‌స్య బారిన ప‌డ‌డానికి ప్ర‌ధాన కార‌ణాలని చెప్ప‌వ‌చ్చు. షుగ‌ర్ వ్యాధి బారిన ప‌డితే మ‌నం జీవితాంతం మందులు వాడాల్సి ఉంటుంది. మందులు వాడిన‌ప్ప‌టికి కొందరిలో షుగ‌ర్ వ్యాధి అదుపులో ఉండ‌దు. అలాంటి వారు వారి కొన్ని ఆయుర్వేద చిట్కాల‌ను వాడ‌డం వల్ల మంచి ఫ‌లితం ఉంటుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆయుర్వేదం ప్ర‌కారం మ‌నం తీసుకునే కొన్ని ఆహారాల్లో అలాగే ర‌కాల లోహాల్లో షుగ‌ర్ ను అదుపులో ఉంచే గుణం ఉంది. వీటిని మ‌నం ఉప‌యోగించ‌డం వ‌ల్ల షుగ‌ర్ వ్యాధి అదుపులోకి రావ‌డంతో పాటు షుగ‌ర్ వ్యాధి వ‌ల్ల క‌లిగే దుష్ప్ర‌భావాలు కూడా అదుపులో ఉంటాయి. కొంతమంది మందులు వాడిన‌ప్ప‌టికి కొందరిలో షుగ‌ర్ వ్యాధి అదుపులో ఉండ‌దు. అలాంటి వారు కొన్ని ఆయుర్వేద చిట్కాల‌ను వాడ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది.


ఆయుర్వేద చిట్కాలు: 


ప‌సుపు: మ‌నం రోజూ త‌యారు చేసే వంట‌ల్లో ప‌సుపును మ‌రింత ఎక్కువ‌గా వేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల షుగ‌ర్ వ్యాధి అదుపులోకి వ‌స్తుంది.


రాగి పాత్ర‌ల నీరు: రాత్రి పాత్ర‌లో నిల్వ చేసిన నీటిని తాగ‌డం వ‌ల్ల కూడా మంచి ఫ‌లితం ఉంటుంది. షుగ‌ర్ వ్యాధిని అదుపులో ఉంచే గుణం రాగి పాత్ర‌ల‌కు ఉంది.


మెంతులు: షుగ‌ర్ వ్యాధితో బాధ‌ప‌డే వారు మెంతుల‌ను వాడ‌డం వ‌ల్ల కూడా మంచి ఫ‌లితం ఉంటుంది. రాత్రంతా నీటిలో నాన‌బెట్టిన మెంతుల‌ను తిని ఆ నీటిని తాగాలి. లేదంటే మొల‌కెత్తిన మెంతుల‌ను నేరుగా తిన‌వ‌చ్చు. అలాగే నీటిలో మెంతి పిండి క‌లుపుకుని తాగ‌వ‌చ్చు.


అల్లం టీ: టైప్ 2 డ‌యాబెటిస్ తో బాధ‌ప‌డే వారు అల్లం టీని తీసుకోవ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. ఆయుర్వేదం ప్ర‌కారం శ‌రీరంలో వ్యాధుల‌ను త‌గ్గించే గుణం అల్లానికి ఉంది. వంట‌ల్లో అల్లాన్ని వాడ‌డంతో పాటు అల్లంతో టీ ని త‌యారు చేసుకుని తాగ‌డం వ‌ల్ల షుగ‌ర్ వ్యాధి అదుపులోకి వ‌స్తుంది.


దాల్చిన చెక్క: దాల్చిన చెక్క టీ తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి.


కాకరకాయలు: కాకరకాయలలో రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచే గుణం ఉంది.


నల్ల శనగలు: నల్ల శనగలు తినడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అదుపులో ఉంటాయి.


నేరేడు పండ్లు: నేరేడు పండ్ల ఆకులను నమిలి తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.


ఉసిరికాయ: ఉసిరికాయ జ్యూస్ తాగడం లేదా ఉసిరికాయ ముక్కలు నమిలి తినడం వల్ల షుగర్ వ్యాధి అదుపులోకి వస్తుంది.


ఆయుర్వేద చిట్కాలు:


జీవనశైలి మార్పులు: ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, సరైన బరువు కలిగి ఉండటం వంటి జీవనశైలి మార్పులు షుగర్ వ్యాధిని నియంత్రించడంలో చాలా ముఖ్యమైనవి.


ధ్యానం మరియు యోగా: ధ్యానం, యోగా ఒత్తిడిని తగ్గించడానికి  రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి సహాయపడతాయి.


ఆయుర్వేద మందులు: షుగర్ వ్యాధిని నియంత్రించడానికి అనేక ఆయుర్వేద మందులు అందుబాటులో ఉన్నాయి. అయితే, ఏదైనా మందులు తీసుకునే ముందు వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం.


ఈ ఆహారాలు, చిట్కాలను మీ రోజువారీ జీవితంలో చేర్చడం వల్ల షుగర్ వ్యాధిని అదుపులో ఉంచుకోవడంలో సహాయపడుతుంది.


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి