Badam Tea: ప్రతి రోజూ ఉదయం టీ లేదా కాఫీ తాగనివారుండరు. టీ చాలా రకాల్లో అందుబాటులో ఉందిప్పుడు. వివిధ రకాల ఫ్లేవర్స్‌తో వస్తోంది. అందులో ఒకటి బాదం టీ. బాదం టీ..ఆరోగ్యపరంగా ఎంతవరకూ మంచిదనేది ఇప్పుడు పరిశీలిద్దాం. (Health Benefits with Badam Tea and here is the simple tips)


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆధునిక బిజీ లైఫ్‌లో టీ లేదా కాఫీ అనేది ఓ నిత్యకృత్యమైంది చాలామందికి. ఇటీవలి కాలంలో టీ చాలా వెరైటీల్లో అందుబాటులో ఉంటోంది. లెమన్ టీ, హనీ టీ, బెల్లం టీ, బాదం టీ, జింజర్ టీ, బ్లాక్ టీ, అల్లం-బెల్లం టీ ఇలా విభిన్నరకాలుగా ఉంది. ఇందులో కీలకమైంది బాదం టీ. బాదం టీతో చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అవి తెలుసుకునేముందు బాదం గురించి తెలుసుకుందాం.


డ్రై ఫ్రూట్స్‌లో బాదం కీలకమైంది దాదాపు అందరికీ బాదం మంచిదే. ఇందులో పుష్కలంగా యాంటీ ఆక్సిడెంట్లు, హెల్తీ ఫ్యాట్, విటమిన్లు, ఖనిజాలుంటాయి. అంతేకాకుండా బాదంలో ఉండే ప్రోటీన్, ఫైబర్, విటమిన్ ఇ, కాల్షియం, జింక్ వంటివి ఆరోగ్యానికి చాలా మంచిది. బాదంలో ఉండే పోషక పదార్ధాలు కచ్చితంగా కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో దోహదపడుతాయి. అదే సందర్భంలో బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను కూడా తగ్గిస్తుంది. నానబెట్టిన బాదం పప్పులో మెగ్నీషియం పుష్కలంగా లభిస్తుంది. టైప్ 2 డయాబెటిస్ వ్యాధిగ్రస్థులకు ఇది చాలా మంచిది. శరీరానికి మెగ్నీషియం సరైన మోతాదులో లభిస్తే..కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఫలితంగా గుండెపోటు ప్రమాదం చాలావరకూ తగ్గుతుంది. బాదం పప్పును ఏ రూపంలో తీసుకున్నా మంచిదే. అయితే బాదంతో టీ కాచుకుని తీసుకుంటే రుచితో పాటు ఆరోగ్యం కలుగుతుంది.


బాదం టీ ప్రయోజనాలు


దీర్ఘకాలిక వ్యాధుల నిర్మూలన, మంట తగ్గించడం, శరీరం విషతుల్యం కాకుండా కాపాడుకోవడం, ఏజీయింగ్ ప్రాసెస్ నియంత్రణ అనేది బాదం పప్పులతో సాధ్యమే. బాదం టీ (Badam Tea) ఆరోగ్యానికి అంత మంచిది. యాంటీ ఏజీయింగ్, ఫైటో స్టెరాల్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఇ పుష్కలంగా ఉండటంతో ఫ్రీ రాడికల్స్ ప్రభావం తగ్గుతుంది. మరోవైపు బాదం టీ మూత్రపిండాల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. జీవక్రియను వేగవంతం చేస్తుంది బాదం టీ. బాదం టీ ద్వారా లభించే యాంటీ ఆక్సిడెంట్లతో ఫ్రీ రాడికల్స్ దూరమౌతాయి. ఆక్సికరణ ప్రక్రియ జరగడంతో ఒత్తిడి, గుండె జబ్బులు ఆర్థరైటిస్ నియంత్రణలో ఉంటాయి.


Also read: Sprouts on Empty Stomach: ఖాళీ కడుపుతో ఇవి తింటే ఆరోగ్యం మరింత మెరుగవుతుంది!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.