Banana Benefits: అరటి పండ్లు తింటే ఇన్ని లాభాలా?.. ఈ వ్యాధులు ఉన్నవారు తప్పకుండా తినండి!
Banana Benefits In Telugu: ప్రతి రోజు అరటి పండ్లను తినడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి విముక్తి కలిగిస్తుంది. అంతేకాకుండా మెదడుకు కూడా శక్తిని అందిస్తుంది.
Banana Benefits In Telugu: అరటి పండు శరీరానికి కావాల్సిన ఎన్నో రకాల పోషకాలు లభిస్తాయి. ఇందులో పొటాషియం కూడా అధిక మోతాదులో లభిస్తుంది. కాబట్టి ప్రతి రోజు తినడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. ఇందులో జీర్ణక్రియకు కావాల్సిన ఫైబర్ లభిస్తుంది. ఇది మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు. ఇవే కాకుండా ఇందులో విటమిన్స్ కూడా లభిస్తాయి. కాబట్టి రోజు తినడం వల్ల శరీరానికి రోగనిరోశక్తి లభిస్తుంది. ఈ అరటిలో ఉండే గుణాలు ఇతర అనారోగ్య సమస్యల నుంచి కూడా విముక్తి కలుగుతుంది. అయితే ఏయే లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
గుండె సమస్యలకు చెక్:
అరటి పండులోని పొటాషియం అధిక పరిమాణంలో లభిస్తుంది. కాబట్టి రోజు తినడం వల్ల రక్తపోటును నియంత్రణలో ఉంటుంది. దీంతో పాటు గుండె సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది. అలాగే గుండెపోటు వంటి సమస్యలను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది.
ఆరోగ్యకమైన జీర్ణక్రియ కోసం:
అరటిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ప్రతి రోజు వీటిని తినడం వల్ల మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలను తగ్గిస్తుంది. ముఖ్యంగా తరచుగా జీర్ణక్రియ సమస్యలతో బాధపడుతున్నవారు రోజు అరటి తినడం చాలా మంచిది.
ఎముకల ఆరోగ్యానికి చెక్:
అరటి పండులోని కాల్షియం, మెగ్నీషియం ఎముకలను దృఢంగా చేసేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా ఆస్టియోపోరోసిస్ వంటి దీర్ఘకాలిక ఎముకల వ్యాధులు రాకుండా ఉంటాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
మెదడుకు శక్తి:
అరటి పండులోని విటమిన్ బి6 మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. అలాగే మూడ్ స్వింగ్స్‌ను తగ్గించి, ఒత్తిడి వంటి సమస్యలను తగ్గించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే మెదడుకు శక్తిని అందించేందుకు కూడా ఎంతగానో సహాయపడుతుంది.
కండరాల పనితీరు:
తీవ్రమైన వ్యాయామం చేసే వారికి అరటి పండు ఎంతగానో సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఎందుకంటే ఇందులో ఉండే గుణాలు కండరాల నొప్పిని తగ్గించి, కండరాల పనితీరును మెరుగుపరుస్తుంది.
రోగ నిరోధక శక్తి:
అరటిలో ఉండే విటమిన్ సి, విటమిన్ బి6 రోగ నిరోధక శక్తిని పెంచే యాంటీ ఆక్సిడెంట్లు అరటి పండులో పుష్కలంగా ఉంటాయి. కాబట్టి రోజు తినడం వల్ల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి విముక్తి కలుగుతుంది.
ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.