Banana peel : మనలో చాలామంది భోజనం చేసిన తర్వాత అరటిపండు తింటాము. అరటి పండులో పుష్కలంగా దొరికే పొటాషియం శరీరంలో ఏర్పడే పలు రకాల నొప్పులను దూరంగా ఉంచుతుంది. ఇందులో ఉన్న డైట్రి ఫైబర్స్ కడుపును శుభ్రపరచడమే కాకుండా మలబద్ధకం లాంటి సమస్యను తగ్గిస్తాయి. ఉపవాసం చేసేవారు కూడా అరటి పండు తినడం వల్ల సంపూర్ణ ఆహారం తీసుకున్న శక్తిని పొందుతారు. ఇన్ని సుగుణాలు ఉన్న అరటిపండు ని తిని పాపం దాని తొక్కని మాత్రం తేలికగా విసిరి పక్కన పడేస్తాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మనలో చాలామందికి తెలియని విషయం ఏమిటంటే.. అరటి పండు తొక్కతో చర్మ సౌందర్యాన్ని ద్విగినీకృతం చేయడమే కాకుండా మోచేతులు ,కాళ్లు దగ్గర మొద్దుగా , నల్లగా ఉన్న ప్రదేశాలను కాంతివంతంగా చేయవచ్చు. ఇంటి వద్దనే ఎటువంటి ఖర్చు లేకుండా నేచురల్ పద్ధతిలో అరటి తొక్కను ఉపయోగించి పెడిక్యూర్ చేసుకోవచ్చు అని మీకు తెలుసా? నిజమండి బాబోయ్ ఈ ఒక్క చిన్న చిట్కాతో పార్లర్ కు వెళ్లి వేలకు వేలు ఖర్చు పెట్టి చేయించుకున్న రాని మెరుపు మీ సొంతం అవుతుంది.


మరి అరటిపండు తొక్కను ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం.. అరటిపండు తిన్నాక ఆ తొక్క ను అంటే లోపల తెల్లటి భాగం గుజ్జుగా ఉంటుంది చూడండి అదన్నమాట ..దాని  తీసుకొని.. మోచేతులకి, మోకాళ్ళకి , కాళ్ళకి ఎక్కడైతే మనకు చర్మం కాస్త పొడిబారి మొద్దుభారీ నల్లగా ఉంది అనుకుంటాము చూడండి..అక్కడ రుద్దాలి. ఇలా రుద్దడం వల్ల చర్మం మీద పేరుకుపోయిన మురికి పోవడమే కాకుండా మృత కణాలు తొలగిపోతాయి. పైగా ఇందులో ఉన్న సహజమైన తేమగుణం చర్మాన్ని మృదువుగా మారుస్తుంది.


మామూలుగా పార్లర్ కి వెళ్లి చేతులకు మేనిక్యూర్ ,కాళ్లకు పెడిక్యూర్ చేయించుకుంటాము. కొంతమంది డబ్బు ఖర్చు పెట్టి కెమికల్స్ తో నిండిన ప్రొడక్ట్స్ తెచ్చుకొని ఇంటివద్దె చేసుకుంటారు. రెండిట్లో ఎలా చేయించుకున్న మీ శరీరాన్ని పూర్తిగా కెమికల్స్ తో నింపేయడం అయితే కన్ఫామ్. దీనివల్ల క్రమంగా చర్మంపై పలు రకాల ఇన్ఫెక్షన్స్ తలెత్తుతాయి. అసలు ఈ గోల అంతా లేకుండా.. సహజంగా ఎటువంటి కెమికల్స్ లేకుండా, సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఇంటి వద్దనే మీ చేతులను కాళ్ళను మృదువుగా చేసుకోవచ్చు.


ముందుగా పాదాలను బాగా శుభ్రంగా కడుక్కొని నీట్ గా తుడుచుకోవాలి. ఇప్పుడు అరటిపండు తొక్కని చిన్న ముక్కలుగా కట్ చేసి దాన్ని పాదం పై బాగా రుద్ది మర్దన చేయాలి. అలాగే ఒక ఐదు నిమిషాలు ఉంచి తర్వాత గోరువెచ్చటి నీటితో కాళ్ళను శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కాళ్ళ పగుళ్ల సమస్య కూడా తగ్గుతుంది. అంతేకాదు చలికాలంలో తేమ వల్ల కాళ్ల మధ్య ఏర్పడే ఇన్ఫెక్షన్స్ కూడా తగ్గుతాయి. 


పాదాలు కాస్త నల్లగా మురికిగా ఉన్నాయి అనుకుంటే అరటి పండు తొక్క పై కాస్త బేకింగ్ సోడా వేసి దానితో రుద్దండి .. మీ పాదాలు తెల్లగా మెరిసిపోతాయి .
అంతేకాదండోయ్ అరటిపండు తొక్క ,కాస్త పెరుగు, తేనె మిక్సీలో వేసి బాగా పేస్ట్ లాగా చేసుకుని తలకు పట్టించి అరగంట అయ్యాక తల స్నానం చేస్తే మీ జుట్టు కెరటిన్ ట్రీట్మెంట్ తీసుకున్నట్టు నిగనిగా మెరిసిపోతుంది. దీన్ని ఫేస్ కి ఫేస్ ప్యాక్ లాక్ కూడా వేసుకోవచ్చు. దీనివల్ల మీ చర్మం బౌన్సీగా, మృదువుగా మారుతుంది.


గమనిక:


పైన ఇవ్వబడిన సమాచారం కేవలం నిపుణుల సూచనల మేరకు సేకరించడమైనది. ఏదైనా పాటించే ముందు మీ డాక్టర్ ను ఒకసారి సంప్రదించడం మంచిది.


Also Read:  King Cobra Viral Video: వీడి ధైర్యానికి దండేసి దండం పెట్టాల్సిందే.. కింగ్ కోబ్రాకు బాత్ రూమ్‌లో స్నానం  


Also read: Balakrishna: బావ కోసమా..ఆ స్థానం కోసమా, బాలకృష్ణ ఓదార్పు యాత్ర ప్రకటన మర్మమేంటి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook