Beauty Tips: ఆధునిక జీవన శైలిలో వివిధ రకాల ఆహారపు అలవాట్ల కారణంగా ముఖంపై ముడతలు ఏర్పడుతుంటాయి. పింపుల్స్, మరకలు, మచ్చలు కూడా వెంటాడుతుంటాయి. వీటిని నిర్లక్ష్యం చేయడం మంచిది కాదు. మార్కెట్‌లో లభించే వివిధ రకాల క్రీముల్ని వినియోగించే కంటే హోమ్ మేడ్ ఫేస్‌ప్యాక్‌తో మంచి లాభాలుంటాృయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సాధారణంగా వయస్సు మీరేకొద్దీ పింపుల్స్, మరకలు, మచ్చలు పడుతుంటాయి. అదే సమయంలో చర్మంపై ముడతలు ఏర్పడుతుంటాయి. దీనికోసం బీట్‌రూట్ ఫేస్‌ప్యాక్ అద్భుతంగా ఉపయోగపడుతుంది. అందంగా కన్పించేందుకు, చర్మం నిగనిగలాడేందుకు బీట్‌రూట్ ఫేస్‌ప్యాక్ బాగా ఉపయోగపడుతుంది. వయస్సు పెరిగే కొద్దీ పింపుల్స్ , మచ్చలు, మరకలు, ముడతల సమస్యలు బాధిస్తుంటాయి. ఈ సమస్యల్నించి ఉపశమనం పొందేందుకు మార్కెట్‌లో లభించే బ్యూటీ కేర్ ఉత్పత్తుల కంటే నేచురల్ హోమ్ మేడ్ ఫేస్‌ప్యాక్ వినియోగించడం మంచిది. దీనికోసం బీట్‌రూట్ ఫేస్‌ప్యాక్ ట్రై చేసి చూడమంటున్నారు ఆరోగ్య నిపుణుు. 


బీట్‌రూట్ ఫేస్‌ప్యాక్ తయారు చేసేందుకు 1 బీట్‌రూట్, శెనగపిండి 2 చెంచాలు, పెరుగు 1 చెంచా, కొద్దిగా తేనె అవసరమౌతుంది. బీట్‌రూట్ ఫేస్ ప్యాక్ తయారు చేసేందుకు ముంందుగా ఒక బీట్‌రూట్ రసం తీసుకోవాలి. ఆ తరువాత ఓ గిన్నెలో బీట్‌రూట్ రసం పోసి అందులో 2 చెంచాల శెనగపిండి, 1 చెంచా పెరుగు, కొద్దిగా తేనె వేసి బాగా కలుపుకోవాలి. అంతే మీక్కావల్సిన బీట్‌రూట్ ఫేస్‌ప్యాక్ తయారైనట్టే.


బీట్‌రూట్ ఫేస్‌ప్యాక్ రాసేముందు ముఖాన్ని బాగా శుభ్రం చేసుకోవాలి. ఆ తరువాత ముఖానికి బీట్‌రూట్ ఫేస్‌ప్యాక్ రాసుకోవాలి. కనీసం 15-20 నిమిషాలుంచి నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఇలా నెలరోజులు చేస్తే మెరుగైన ఫలితాలు కన్పిస్తాయి. 


Also read: Monsoon Skin Care: వర్షాకాలంలో ముఖ సౌందర్యానికి అద్భుతమైన ఫేస్‌ప్యాక్ ఇదే, ఎలా చేయాలంటే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook