Beer Health Benefits: మన సమాజంలో మద్యపానం చేసిన వారిన కొందరు హీనంగా చూస్తుంటారు. అయితే అదో చెడు అలవాటు, అలాంటి వాళ్లకు దూరంగా ఉండాలంటూ తిడుతుండడం మనం ఎప్పుడో ఒకప్పుడు చూసే ఉంటాం. చాలా మందికి మందు బాబులకు బీర్ ను ఎంతో ఆస్వాదిస్తారు. మరీ ముఖ్యంగా వేసవి కాలంలో బీర్ బాటిళ్లను విచ్చలవిడిగా తాగేస్తుంటారు. అలాంటి మందుబాబులకు ఇదో గుడ్ న్యూస్ అనే చెప్పాలి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బీరు మంచిదే..?
అమెరికన్ జర్నల్ ఆఫ్ మెడికల్ సైన్స్ అనే సంస్థ ఇటీవలే ఓ సర్వే నిర్వహించింది. ఈ సర్వే ప్రకారం రోజూ బీర్ తాగినా ఆరోగ్యానికి మంచిదే అని నివేదిక విడుదల చేసింది. ఇందులో భాగంగా 7 వేల మందికి పైగా చేసిన సర్వేలో ఈ విషయాలను కనుగొన్నట్లు సర్వే స్పష్టం చేసింది. సాధారణంగా గుండె జబ్బులు ఉన్న వారు రోజుకు ఒకటిన్నర నుంచి రెండు గ్లాసుల బీరు పుచ్చుకుంటే మంచిదని సర్వేలో నివేదించారు. మనిషిలో గుండెపోటు వచ్చే అవకాశాన్ని కూడా బీరు తగ్గిస్తుందని సర్వే చేసిన సంస్థ తెలిపింది. 


బీరులో యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయని అమెరికన్ సంస్థ సర్వేలో పేర్కొంది. అయితే దీన్ని తాగడం వల్ల అనేక వ్యాధులకు చెక్ పెట్టవచ్చని స్పష్టం చేసింది. బీరులో విటమిన్ - బి, ప్రొటీన్లు కూడా ఉంటాయని వెల్లడించింది. కానీ, వై‌న్ తో పోలిస్తే బీర్ లోనే ఎక్కువ ప్రొటీన్లు ఉంటాయని సర్వే తేల్చి చెప్పింది. 


Also Read: Petrol And Diesel Prices: శుభవార్త.. పెట్రోల్, డీజిల్‌పై కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు


ఎముకలు బలంగా..
వీటితో పాటు బీరు తాగడం వల్ల ఎముకలు బలంగా మరేందుకు కావాల్సిన పదార్థాలు ఉన్నాయని సర్వే చేసిన అమెరికన్ జర్నల్ ఆఫ్ మెడికల్ అండ్ సైన్స్ సంస్థ తెలిపింది. అయితే ఇందులో షాకింగ్ విషయం ఏంటంటే.. బీరు తాగడం వల్ల దంతాల ఆరోగ్యానికి తోడ్పడుతుందట. నోటిలో క్యావిటీస్ రాకుండా చేసే ఉత్ప్రేరకాలు బీర్ లో ఉన్నాయట. 


దంతాలు, చిగుర్లు, నాలుకపై ఎలాంటి ఇన్ఫెక్షన్ కలిగే బ్యాక్టీరియాలను నిర్మూలించడానికి సహకరిస్తుందని సర్వే పేర్కొంది. వారానికి దాదాపుగా 14 గ్లాసుల బీర్ తాగితే టైప్ 2 డయాబెటిస్ కు గురయ్యే ప్రమాదం తగ్గుతుందట. కానీ, అతిగా ఏది తీసుకున్న ప్రమాదమే అని.. ఊహించని రోగాలు ఎదురయ్యే అవకాశం ఉందని సర్వే వెల్లడించింది.


Also Read: Huawei Mate X5 Price: చీప్‌ అండ్‌ బెస్ట్‌ ఫోల్డబుల్ మొబైల్‌ వచ్చేసింది..ధర తెలిస్తే షాక్‌ అవుతారు!  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook