Beetroot Red Velvet Tea For Weight Loss: బీట్‌రూట్‌ని ఆరోగ్య నిపుణులు సూపర్ ఫుడ్స్‌గా భావిస్తారు. ఇందులో ప్రోటీన్, ఫైబర్, కాల్షియం, ఐరన్ అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి వీటిని ప్రతి రోజు ఆహారంలో తీసుకోవడం వల్ల రక్త కోరత, రక్తపోటు సమస్యలు సులభంగా దూరమవుతాయి. అంతేకాకుండా ఈ బీట్‌రూట్‌తో తయారు చేసిన సలాడ్స్‌ తినడం వల్ల రక్తపోటు, షుగర్ అదుపులో ఉంటుంది. అందుకే రక్తపోటు సమస్యలతో బాధపడేవారికి ఆయుర్వేద నిపుణులు బీట్‌రూట్‌ జ్యూస్‌ను ప్రతి రోజు తాగమని సూచిస్తారు. ముఖ్యంగా చెడు కొలెస్ట్రాల్‌ సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు బీట్‌రూట్ రసాన్ని తాగితే ఉపశమనం లభిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇవే కాకుండా ఆరోగ్య నిపుణులు సూచించిన బీట్‌రూట్ రెడ్ వెల్వెట్ టీని తాగడం వల్ల రెట్టింపు ప్రయోజనాలు పొందొచ్చు.  బీట్‌రూట్ రెడ్ వెల్వెట్ టీలో శరీరానికి కావాల్సిన అన్ని రకాల పోషకాలు లభించడమేకాకుండా శరీర బరువును కూడా తగ్గిస్తాయి. అయితే ఈ టీని ఎలా తయారు చేసుకునే పద్ధతిని ఇప్పుడు మనం తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బీట్‌రూట్ రెడ్ వెల్వెట్ టీ చేయడానికి కావలసిన పదార్థాలు:


  • 3 టేబుల్ స్పూన్లు బీట్‌రూట్ రసం

  • 2 టీస్పూన్లు బ్లాక్ టీ ఆకులు

  • 3 కప్పుల నీరు

  • 2 లవంగాలు

  • 6 ఏలకులు  

  • 2 అంగుళాల అల్లం ముక్క

  • 2 కప్పులు పాలు

  • 2 దాల్చిన చెక్క ముక్కలు


రెడ్ వెల్వెట్ టీ తయారీ విధానం:
ఈ టీని తయారు చేయడానికి ముందుగా ఒక చిన్న పాన్‌ను తీసుకోవాల్సి ఉంటుంది. 
అందులో 3 కప్పుల నీటిని వేసుకోవాల్సి ఉంటుంది. 
ఆ తర్వాత  6 ఏలకులు, 2 లవంగాలు, 1 అంగుళం అల్లం, 2 స్టిక్స్ దాల్చినచెక్క లేతగా వేయించాలి.
ఇలా వేయించుకున్న పదార్థాలను ఆ నీటిలో వేసుకుని ఉడికించుకోవాలి.
అందులోనే టీ ఆకులను వేసి బాగా మరిగించుకోవాలి.
సుమారు 5 నిమిషాలు ఉడకబెట్టిన తర్వాత పాలు పోసి మరిగించాలి.
ఇలా ఉడికే టీలో 3 చెంచాల బీట్‌రూట్ రసం వేయాలి.
ఇలా అన్ని మిశ్రమాలను వేసి 15 నిమిషాల పాటు ఉడికిస్తే..రెడ్ వెల్వెట్ టీ తయారైనట్లే..

(నోట్‌: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook