How To Reduce Belly Fat: చెడు కొలెస్ట్రాల్ అధిక పరిమాణంలో ఉండే ఆహారాలు అతిగా తీసుకోవడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలతో పాటు పొట్ట చుట్టు కొలెస్ట్రాల్‌ పెరిగిపోతోంది. దీని కారణంగా చాలా మందిలో పొట్ట విపరీతంగా పెరిగిపోతోంది. అంతేకాకుండా అందహీనంగా కూడా కనిపిస్తున్నారు. ఇలాంటి సమస్యతో బాధపడేవారు తప్పకుండా ప్రతి రోజు వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆహారాలను డైట్‌ పద్ధతిలో తీసుకోవాల్సి ఉంటుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయతే ఆరోగ్య నిపుణులు సూచించిన ఈ చిట్కాను పాటిస్తే సులభంగా బెల్లీ ఫ్యాట్‌కు చెక్‌ పెట్టొచ్చు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వీటిని ఆహారంలో తీసుకోవాలి:
బెల్లీ ఫ్యాట్‌ను తగ్గించుకునే క్రమంలో తప్పకుండా శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాల్సి ఉంటుంది. దీని కోసం ప్రతి రోజు డైట్‌లో పండ్లు, రసాలు, పెరుగు, ఇతర ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్‌కు బయటకు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ప్రతి రోజు 2 నుంచి 3 లీటర్ల నీటిని తాగాల్సి ఉంటుంది. 


ప్రొటీన్స్‌ గల ఆహారాలు తప్పనిసరి:
బరువు తగ్గే క్రమంలో డైట్‌లో ఎక్కువగా ప్రొటీన్స్‌ గల ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా డైట్‌లో ప్రతి రోజు ఆహారాలు తీసుకుంటే పొట్ట చుట్టూ కొలెస్ట్రాల్‌ కూడా సులభంగా తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అందుకే మీ ఆహారంలో పప్పులు, గుడ్లు, సోయాను ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది.


Also read: Raksha Bandhan 2023: ఈ సంవత్సరం రాఖీ పండుగ ఎప్పుడు వచ్చిందో తెలుసా?
నిద్రలేమి సమస్యలు లేకుండా చూసుకోండి:
బెల్లీ ఫ్యాట్‌ను తగ్గించుకునే క్రమంలో తప్పకుండా 7 నుంచి 8 గంటల పాటు నిద్ర పోవాల్సి ఉంటుంది. ఇలా నిద్రపోతేనే శరీరం యాక్టివ్‌గా తయారవుతుంది. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధుల నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుంది. సులభంగా బరువుతో పాటు బెల్లీ ఫ్యాట్‌ను తగ్గించుకోవాలనుకునేవారు తప్పకుండా ఈ చిట్కాను పాలో అవ్వాల్సి ఉంటుంది.


అనారోగ్యకరమైన ఆహారాలు తినకూడదు:
బరువు పెరగడానికి ప్రధాన కారణాలు అనారోగ్యకరమైన ఆహారాలు అతిగా తీసుకోవడమేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అనారోగ్యకరమైన ఆహారాలు అతిగా తీసుకోవడం వల్ల శరీరంలో కేలరీలు పెరుగుతాయి. దీని కారణంగా బరువు పెరిగే అవకాశాలున్నాయి. కాబట్టి ఫ్యాకింగ్‌ ఫుడ్‌ తీసుకోవడం మానుకోవాల్సి ఉంటుంది. 


(నోట్‌: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ జ్ఞానంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)


Also read: Raksha Bandhan 2023: ఈ సంవత్సరం రాఖీ పండుగ ఎప్పుడు వచ్చిందో తెలుసా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook