Belly Fat Reduce 10 Days: బరువు పెరగడం వల్ల చాలా మంది తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ముఖ్యంగా చాలా మందిలో అనారోగ్య సమస్యలకు గురికావడానికి అధిక శరీర బరువే కారణమని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. పెరుగుతున్న బరువును నియంత్రించుకోవడానికి తప్పకుండా తీసుకునే ఆహారాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. అంతేకాకుండా అనారోగ్యకరమైన ఆహారాలు తీసుకోకపోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. బరువు పెరగడం వల్ల చాలా మందిలో బెల్లీ ఫ్యాట్‌ కూడా పెరుగుతుంది. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఈ కింది 3 చెడు అలవాట్లను మానుకోవాల్సి ఉంటుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బరువు పెరగడానికి కారణమయ్యే 3 చెడు అలవాట్లు:
1. వ్యాయామాలు చేయకపోవడం
:
శారీరక శ్రమ లేకపోవడం వల్ల కూడా సులభంగా బరువు పెరుగుతారని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఆధునిక జీవన శైలి కారణంగా చాలా మందిలో శరీరక శ్రమ తగ్గిపోతోంది. ఎక్కువ కూర్చోవడం, విశ్రాంతి కారణంగా చాలా మందిలో కొలెస్ట్రాల్‌ పేరుకుపోతోంది. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ప్రతి రోజూ వ్యాయామాలు కూడా చేయాల్సి ఉంటుంది.


2. ఒత్తిడి:
టెన్షన్ పెరగడం కారణంగా కూడా ఊబకాయం వంటి సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఒత్తిడి కారణంగా చాలా మందిలో గుండె పోటు సమస్యలు కూడా వస్తున్నాయి. కాబట్టి ఒత్తిడి సమస్యలతో బాధపడేవారు కుటుంబ విభేదాలు, పాత శత్రుత్వాలకు దూరంగా ఉండడం చాలా మంచిది. కాబట్టి బరువు పెరుగుతున్నవారు ఒత్తిడికి దూరంగా ఉండడం చాలా మంచిది.


3. మద్యపానం వ్యసనం:
మద్యపానం సామాజిక దురాచారం మాత్రమే కాదు..ఆరోగ్యానికి కూడా చాలా హాని కలిగిస్తుందని అందరికీ తెలుసు. క్రమం తప్పకుండా తాగే అలవాటు ఉన్నవారిలో పొట్ట, నడుము చుట్టూ కొవ్వు పేరుకుపోవడం ప్రారంభమవుతుంది. దీంతో వీపరీతమైన శరీర బరువు కూడా పెరుగుతారు. కాబట్టి ప్రతి రోజూ మద్యపానం సేవించడం చాలా ప్రమాదకరమని నిపుణులు సూచిస్తున్నారు.


(నోట్‌: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)


Also Read:  Thalapathy 67 Updates : లోకేష్ సినిమాటిక్ యూనివర్సిటీలోకి సంజయ్ దత్.. విజయ్‌ సినిమా క్యాస్టింగ్ ఇదే


Also Read: Sai Pallavi : జీవితంలో అవి ఉంటే చాలట.. నవ్వులు చిందిస్తున్న సాయి పల్లవి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook