Yoga Asanas To Reduce Belly Fat: ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం శరీర బరువు నిర్వహణ చాలా ముఖ్యం. అయితే, కడుపు చుట్టూ పేరుకుపోయే బొల్లి ఫ్యాట్ చాలా మందిని వేధిస్తుంది. డైట్ నియమాలు, వ్యాయామం తదితరాల ద్వారా బెల్లీ ఫ్యాట్‌ను తగ్గించుకోవచ్చు. ఈ ప్రయత్నంలో యోగా చాలా సహాయపడుతుంది. యోగా శరీరాని ఆరోగ్యంగా , చరుకుగా ఉంచడంలో ఎంతో సహాయపడతుంది. దీని వల్ల శరీరానికి కలిగే అనారోగ్య సమస్యలను సులువుగా తొలగించుకోవచ్చు.  ముఖ్యంగా బెల్లీ ఫ్యాట్‌ను తొలగించుకోవచ్చు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బెల్లీ ఫ్యాట్ కోసం కొన్ని ప్రభావవంతమైన యోగాసనాలు:


1. వజ్రాసనం: 


ఈ ఆసనం మలబంధన సమస్యలను తగ్గించడానికి , జీర్ణవ్యవస్థను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. ఇది భోజనం తర్వాత 5-10 నిమిషాలు ఈ ఆసనంలో కూర్చోవడం వల్ల కడుపు కొవ్వు కరిగే ప్రక్రియ ప్రారంభమవుతుంది. వజ్రాసనంలో కూర్చోవడానికి, మడమలపై కూర్చోండి, పాదాలు వెనక్కి చాచి, పెద్ద బొటనవేళ్లు కలుస్తాయి. వీపు నిటారుగా ఉంచండి, ఊపిరి పీల్చి, వదలండి. ఇలా 5 నిమిషాలు ఈ భంగిమలో ఉండండి.



2. తిర్యక్‌ భుజంగాసనం:


ఈ ఆసనం కడుపు కండరాలను బలపరుస్తుంది. అలాగే జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. బొల్లి ఫ్యాట్‌ను తగ్గించడానికి సహాయపడుతుంది.
ముందు కడుపు మీద పడుకోండి, నుదురు నేలమీద ఉండేలా చూడండి. కుడి చేతిని ఎత్తి, పైకి చాచి, ఎడమ మోకాలి కింద ఉంచండి. ఎడమ చేయిని శరీర వెనుకకు చాచి, తలను పైకి ఎత్తండి. ఊపిరి పీల్చి, ఛాతీని ముందుకు నేల వైపు ఉంచాలి. కొన్ని సెకన్లు ఈ భంగిమలో ఉండి, ఊపిరి వదలండి. ఇరువైపులా 5-10 సార్లు పునరావృతం చేయండి.



3. పవనముక్తాసనం:


ఈ ఆసనం వాయువు సమస్యలను తగ్గించడానికి  కడుపు కండరాలను బలపరుస్తుంది. ఇది బొల్లి ఫ్యాట్‌ను తగ్గించడానికి సహాయపడుతుంది.
వెల్లరి మీద పడుకోండి, కాళ్ళు చాచి, చేతులు శరీర పక్కన ఉంచండి. ఊపిరి పీల్చి, కుడి మోకాలిని ఛాతీ వైపుకు లాగండి, చేతులతో దానిని పట్టుకోండి. కొన్ని సెకన్లు ఈ భంగిమలో ఉండి, ఊపిరి వదలండి. ఇదే విధంగా ఎడమ మోకాలితో కూడా చేయండి. ప్రతిచేతితో మోకాళ్ళను పట్టుకోవడానికి కష్టంగా ఉంటే, చేతులను తొడల మీద ఉంచండి. 10-15 సార్లు పునరావృతం చేయండి.


Also Read: Weight Loss In 10 Days: ఎండా కాలంలో పింపుల్‌గా 10 రోజుల్లో బరువు తగ్గాలనుకునేవారికి నిపుణుల సూచనలు ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter