Soaked Peanuts: నానబెట్టిన శనగలు తో బోలెడన్ని లాభాలు.. రోజు ఉదయాన్నే ఇలా చేసి చూడండి
Peanuts: మనలో చాలామందిక ప్రతిరోజు ఉదయం నానబెట్టి మొలకెత్తించిన గింజలను అల్పాహారంలో తీసుకోవడానికి ఇష్టపడతారు. కొంతమంది వీటిని జూస్ లాగా చేసుకొని తాగుతారు. మరి కొంతమంది వీటిని సలాడ్స్ లో కలుపుకొని తింటారు. అయితే ఎక్కువ శాతం తృణధాన్యాలను, పెసలు వంటి వాటిని మొలకెత్తించుకోవడం మనకు అలవాటు. కానీ శనగలను కూడా మొలకెక్కి తినవచ్చు అని మీకు తెలుసా? అవి మీకు అందించే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో మీకు తెలుసా?
Soaked peanuts: నానబెట్టిన మొలకలు తినడం మనలో చాలామందికి అలవాటు .ముఖ్యంగా డయాబెటిస్ పేషంట్స్ వీటిని అల్పాహారంలో తీసుకోవడానికి ప్రాధాన్యత ఇస్తారు. కానీ మనలో చాలామందికి తెలియని విషయం ఏమిటంటే శనగలను కూడా మొలకెత్తి తినవచ్చు .ఇలా మొలకెత్తిన శనగలను అల్పాహారం గా తీసుకోవడం వల్ల ప్రయోజనాలు చేకూరుతాయి.
శనగలలో ప్రోటీన్ శాతం ఎక్కువగా ఉంటుంది. 100 గ్రాముల వేరుశెనగ పప్పు నుంచి మనకు 25.8 గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది. పైగా ఇందులో ఉన్న ఫైబర్ జీర్ణవ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు ఉదర సంబంధిత సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా నాన్న పెట్టిన వేరుశనగపప్పును తొక్కతో పాటు తీసుకోవడం వల్ల గుండెకు ఎంతో మంచి జరుగుతుంది. ఇలా చేయడం వల్ల గుండెపోటు వచ్చే అవకాశం తగ్గుతుందట.
వెన్ను నొప్పితో బాధపడే వారు నానబెట్టిన వేరుశనగ పప్పులను బెల్లంతో కలిపి తీసుకోవడం వల్ల క్రమంగా వెన్నునొప్పి తగ్గుతుంది. ఇది కంటి మీద ఒత్తిడిని తగ్గించి చూపును మెరుగుపరుస్తుంది. రోజు నానబెట్టిన వేరుశనగ పప్పు తినడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. పైగా వైరల్ ఇన్ఫెక్షన్స్ కారణంగా దగ్గు విపరీతంగా ఉన్నవారు పచ్చి వేరుశనగలు తీసుకోవడం వల్ల దగ్గు తగ్గుతుంది.
కాగా కొందరికి నాన్న పెట్టిన పచ్చి వేరుశనగపప్పు తినాలి అంటే కాస్త కష్టంగా అనిపివచ్చు.. అలాంటివారు ఈ నానబెట్టిన వేరుశనగపప్పును స్టీమ్ చేసుకొని సలాడ్స్ లో కలుపుకొని తినవచ్చు. శాండ్విచ్స్ లో కూడా వీటిని వేసుకోవచ్చు. ఇలా నానబెట్టిన వేరుశనగపప్పు కు కాస్త సన్నగా తరిగిన ఎరగడ్డ ,కొత్తిమీర జోడించి కొద్దిగా నిమ్మరసం ఉప్పు కలిపి తీసుకుంటే అద్భుతంగా ఉంటుంది. ఇలా తినడం వల్ల మనం బరువు కూడా తగ్గవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం ఒకసారి మీరు కూడా ఈరోజు ఆహారంలో ఇది ట్రై చేసేయండి.
గమనిక: పైన ఇచ్చిన సమాచారం నిపుణుల సూచనల మేరకు సేకరించడం జరిగింది. కానీ కొత్తది ఏదైనా ప్రయత్నించే ముందు ఒకసారి మీ డాక్టర్ ను సంప్రదించడం మంచిది.
Also Read: Mega Brothers Photo: ఒకే ఫ్రేమ్‌లో మెగా ఫ్యామిలీ.. కూల్ లుక్‌లో మెగా బ్రదర్స్..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి