Benefits Of Dates: ఖర్జూరాతో శరీరానికి లాభాలే లాభాలు..దీర్ఘకాలిక వ్యాధులకు సైతం చెక్..
Benefits Of Dates: ప్రతి రోజు ఖాళీ కడుపుతో ఖర్జూరాలను ఆహారంలో తీసుకోవడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో ఉండే పోషకాలు తీవ్ర వ్యాధుల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది. వీటిని తినడం వల్ల ఏయే వ్యాధులు తగ్గుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
Benefits Of Dates: ఆధునిక జీవనశైలి కారణంగా చాలా మందిలో పోషకాల లోపం ఏర్పడుతోంది. దీని కారణంగా అలసట, శరీర నొప్పుల బారిన పడున్నారు. దీని కారణంగా దీర్ఘకాలి వ్యాధుల బారిన కూడా పడుతున్నారు. ఇలాంటి సమస్యల బారిన పడకుండా ఉండడానికి తప్పకుండా ప్రతి రోజు ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా తీవ్ర దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా ఉండడానికి ఖర్జూరాలను ఆహారంలో చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో ఉండే ఔషధ గుణాలు శరీరానికి చాలా రకాలుగా ఉపయోగపడతాయి. వీటిని ప్రతి రోజు తీసుకోవడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఖర్జూరాల వల్ల శరీరానికి కలిగే లాభాలు:
ఖర్జూరం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అందుకే చాలా మంది ఆయుర్వేద నిపుణులు దీనిని మూలికగా భావిస్తారు. ఇందులో కాల్షియం, పొటాషియం, ప్రొటీన్లు, మాంగనీస్, మెగ్నీషియం, ఫాస్పరస్‌తో పాటు జింక్, విటమిన్-బి6, ఎ పుష్కలంగా లభిస్తుంది. అంతేకాకుండా ఖర్జూరంలో కార్బోహైడ్రేట్లు, ఐరన్, డైటరీ ఫైబర్, కొవ్వు ఆమ్లాలు కూడా అధిక పరిమాణంలో ఉంటాయి. ఇవి ఆరోగ్యాన్ని అన్ని రకాల వ్యాధుల నుంచి సంరక్షిస్తాయి.
Also Read: Singer Sai Chand: తెలంగాణ ఉద్యమానికి ఊపిరిగా నిలిచిన ప్రముఖ సింగర్ కన్నుమూత
ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఖర్జూరం తినడం శరీర బరువును సులభంగా నియంత్రించుకోవచ్చని ప్రముఖ ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. బరువు తగ్గాలనుకునేవారు ప్రతి రోజు మూడు నుంచి నాలుగు ఖర్జూరాలను ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల సులభంగా ఊబకాయం సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా ఆకలి నియంత్రించేందుకు కూడా సహాయపడుతుంది.
ఖర్జూరం ప్రయోజనాలు:
రక్తపోటును నియంత్రిస్తుంది.
మలబద్ధకం సమస్యను నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.
ఎముకలను దృఢంగా చేస్తుంది.
Also Read: Singer Sai Chand: తెలంగాణ ఉద్యమానికి ఊపిరిగా నిలిచిన ప్రముఖ సింగర్ కన్నుమూత
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి